బాబుకు మరో షాక్.. బీజేపీలోకి వంగవీటి!
ఏపీలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరో షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడకు చెందిన కీలక నేత వంగవీటి రాధా
Vangaveeti may quit TDP: ఏపీలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరో షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడకు చెందిన కీలక నేత వంగవీటి రాధా పార్టీ మారుతారనే ప్రచారం ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. గత కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న ఆయన, బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ విషయమై ఇటీవల హైదరాబాద్‌లో ఓ కేంద్ర మంత్రితో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా వైసీపీలో కీలకంగా పనిచేసిన వంగవీటి రాధా.. తనకు సీటు ఇవ్వలేదన్న కారణంతో గతేడాది ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆ సమయంలో జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే టీడీపీ కూడా ఆయనకు సీటు ఇవ్వలేదు. అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. అంతేనా చంద్రబాబు సీఎం కావాలంటూ యాగాలు కూడా చేశారు. ఇక వైసీపీ విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కాస్త యాక్టివ్‌గానే ఉన్న వంగవీటి.. ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారు. ఆ మధ్యలో రెండు సార్లు పవన్ కల్యాణ్‌ని కలవగా.. జనసేనలో చేరుతాడన్న పుకార్లు వచ్చాయి. కానీ వంగవీటి, జనసేనలో చేరలేదు. ఇక రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే బీజేపీనే యాక్టివ్‌గా ఉంది. ఈ క్రమంలో వంగవీటి కూడా కమల తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
Read More:
అత్యాచారం చేశారంటూ 139 మందిపై ఫిర్యాదు.. లిస్ట్‌లో యాంకర్ ప్రదీప్