Viral Video: అతి చిన్న గోల్డ్ స్మగ్లర్స్.. వామ్మో..! ఈ చీమలు చూడండి బంగారాన్ని ఎలా తీసుకెళ్తున్నాయో..!
బంగారం.. భారతీయులకు మహా ఇష్టం. అందుకే దీనిని విదేశాల నుంచి అనేక రకాలుగా మన దేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక వారి

బంగారం.. భారతీయులకు మహా ఇష్టం. అందుకే దీనిని విదేశాల నుంచి అనేక రకాలుగా మన దేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక వారి ప్రయత్నాలకు కస్టమ్స్ అధికారులు ఎయిర్‌పోర్టులోనే చెక్ పెట్టేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఎన్నోరకాలుగా బంగారాన్ని తరలించడం చూస్తునే ఉంటాం. గోల్డ్ స్మగర్ల తెలివి మాములుగా ఉండదు. బంగారాన్ని కనిపెట్టకుండా.. దుస్తువులలో, చెప్పులలో, జుట్టులో దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించి దొరికిపోతుంటారు. తాజాగా కొందరు మాత్రం బంగారాన్ని ఎంతో జాగ్రత్తగా తరలిస్తూ.. స్మార్ట్ ఫోన్‌కు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఆ వీడియో బంగారాన్ని తరలించేవారంతా.. ఐకమత్యంతో దానిని తీసుకెళ్తున్నారు. అసలు ఆ వీడియో ఎంటో తెలుసుకుందామా.
దీపాన్షు కాబ్రా అనే ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేస్తూ.. అతి చిన్న గోల్డ్ స్మగ్లర్స్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. అదెంటీ అతి చిన్న అనే సందేహం కలగవచ్చు. అవును మరీ అతి చిన్ననే.. ఎందుకుంటే ఆ బంగారాన్ని దొంగిలిస్తున్నది చీమలు. కొన్ని చీమలు ఓ ఇంట్లోని గోల్డ్ చైన్‌ను తీసుకెళ్ళెందుకు తెగ ట్రై చేస్తున్నాయి. అవన్ని ఒక జట్టుగా ఏర్పడి.. ఆ చైన్‌ను జాగ్రత్తగా ఐకమత్యంతో తీసుకెళ్తున్నాయి. ఇది పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ఇంత అతి చిన్న స్మగర్లను పట్టుకోవడం చాలా కష్టమంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తమ పిల్లల కోసం ఈ బంగారు గొలుసును పట్టుకెళ్తున్నాయంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్..
Smallest Gold Smugglers! ? pic.twitter.com/6kBASYP0si
— Dipanshu Kabra (@ipskabra) March 24, 2021
Also Read:
స్నేహితులుగా మారిన అజాత శత్రువులు.. పాముతో జారుడాటలు ఆడిన కప్ప.. వీడియో వైరల్..




