8 ఏళ్ల బాలిక సాహసం.. రైలు నుంచి కిందకి తోసేసినా.. ధైర్యం కోల్పోలేదు.. నిందితుడిని పట్టించింది.!
ఓ ఎనిమిదేళ్ల బాలిక ధైర్యసాహసాలను ప్రదర్శించింది. లైంగిక దాడికి యత్నించిన ఆర్మీ జవాన్‌ను ప్రతిఘటించింది. కదులుతున్న రైలు నుంచి జవాను..
ఓ ఎనిమిదేళ్ల బాలిక ధైర్యసాహసాలను ప్రదర్శించింది. లైంగిక దాడికి యత్నించిన ఆర్మీ జవాన్‌ను ప్రతిఘటించింది. కదులుతున్న రైలు నుంచి జవాను ఆమెను కిందికి తోసేయడంతో గాయపడినా లెక్కచేయక, నిందితుడిని పోలీసులకు పట్టించింది. గోవా–నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ ఘటన జరిగింది. మాజీ సైనికుడి కుమార్తె అయిన ఈ బాలిక.. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి ఢిల్లీ నుంచి వస్తోంది.
ఆర్మీ జవాన్ కూడా అదే బోగీలో ప్రయాణిస్తున్నాడు. అంతా గాఢ నిద్రలో ఉండగా జవాన్ బాలికను టాయిలెట్‌లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాలిక మేల్కొని తీవ్రంగా ప్రతిఘటించడంతో పాటు గట్టిగా కేకలు వేసింది. దీంతో అతడు, తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తానంటూ ఆమెను బయటకు తీసుకొచ్చి రైలు కిందికి తోసేశాడు. అదృష్టవశాత్తూ రైలు ఆ సమయంలో తక్కువ వేగంతో వెళ్తుండటంతో పట్టాలపై పడిపోయిన బాలికకి స్వల్పంగా గాయాలయ్యాయి.
సమీప గ్రామస్తులు బాలికను గమనించి, ఆస్పత్రిలో వైద్యం చేయించారు. కోలుకున్న బాలిక జరిగిన ఘటనను, ముఖ్యంగా ఆర్మీ జవాను పోలికలను పోలీసులకు వివరించింది. దీంతో 400 మంది పోలీసులు, రైల్వే కానిస్టేబుళ్లు వేర్వేరు స్టేషన్లలో ఆ రైలులోకి ప్రవేశించి, ఆ రైలు నుంచి ప్రయాణికులెవరూ కిందికి దిగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బాలిక చెప్పిన ప్రకారం పోలికలున్న 30 మందిని వేరుచేసి, అందులో నిందితుడైన జవాన్‌ను గుర్తించారు.
Also Read:
Viral Video: అయ్యో.! పాపం కోతి.. లెక్క తప్పింది.. బోర్లా పడింది.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video: ఈ జంతువు ఏంటో చెప్పగలరా.? భలేగా డ్యాన్స్ చేస్తోంది కదా.! వైరల్ వీడియో..
Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..