Gucci Kurta: ఈ కుర్తా ఖరీదు చూస్తే కళ్ళు తిరగాల్సిందే..! ట్రోల్ చేస్తున్న దేశీ నెటిజన్లు..
కొన్ని అంతర్జాతీయ కంపెనీలు అమ్మే దుస్తులు, బ్యాగ్‌లు, వాచ్‌ల ఖరీదు చూస్తే కళ్లు తిరుగుతాయి. అంత ఖరీదు పెట్టి కొనటం కేవలం సెలబ్రిటీలకే..
కొన్ని అంతర్జాతీయ కంపెనీలు అమ్మే దుస్తులు, బ్యాగ్‌లు, వాచ్‌ల ఖరీదు చూస్తే కళ్లు తిరుగుతాయి. అంత ఖరీదు పెట్టి కొనటం కేవలం సెలబ్రిటీలకే సాధ్యం అనిపిస్తుంది. అందులోనూ ఆ వస్తువు క్వాలిటీ ఖరీదుకి తగ్గటు ఉందా.! అంటే డౌట్ పడాల్సిందే. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ గూచి బ్రాండ్ ఇన్ హౌజ్‌లో డిజైన్ చేసిన ఓ కుర్తా అమ్మకానికి పెట్టింది. అది మన భారత మహిళలు వేసుకునే కుర్తాలా ఉంది. ఖరీదు తెలిస్తే.. వామ్మో అంటూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతారు. దీనిపై మన దేశీ నెటిజనులు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.
గూచి తాజాగా తన కలెక్షన్‌లో సొంతంగా డిజైన్ చేసిన కుర్తాను ఆర్గానిక్ లినెన్ కఫ్తాన్‌గా పేర్కొంది. ఇక దాని ఖరీదును ఏకంగా 3,500 డాలర్లుగా చూపించింది. అంటే మన కరెన్సీలో సుమారు 2,50,000 లక్షల రూపాయలకు పైగా ఖరీదన్నమాట. ఇంత ఖరీదు పెట్టి కొనలేని వారికి మంత్లీ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రకటించింది.
భారత మహిళా సాంప్రదాయ డ్రెస్‌ను కాపీ కొడుతూ పైగా కఫ్తాన్ అని పేరు పెట్టడం మనోళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుపు రంగు కుర్తా మీద నెక్ దగ్గర మెరూన్ రంగు ఫ్లోరల్ డిజైన్‌తో ఉన్న ఈ కుర్తాకు 2.5 లక్షల రూపాయల ఖరీదుగా ప్రకటించడంతో మన నెటిజనులు కామెంట్లు, ట్రోల్స్‌తో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఏంటి ఈ కుర్తా ఖరీదు 2.5 లక్షలా.. మా అమ్మ 250 రూపాయల్లో కొనుగోలు చేస్తుంది’’ .. ‘‘నేనైతే ఇలాంటివి 500 రూపాయలకు రెండు ఇప్పిస్తాను’’.. ‘‘నా బర్త్‌డేకి ఇదే కొనబోతున్నాను.. అయితే రెండున్నర లక్షల రూపాయలకు కాదు.. కేవలం 250 రూపాయలకు మాత్రమే.. ‘‘బ్రాండ్ పేరు చెప్పి.. ఇంత ఖరీదు ప్రకటించడం ఏమైనా బాగుందా’’అంటూ నెటిజనులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Gucci selling an Indian kurta for 2.5 lakhs ? I’ll get the same thing for 500 bucks ? pic.twitter.com/Opw2mO5xnV
— nalayak (@samisjobless) June 1, 2021
No offense but I won’t buy it for even 500 ?
— Ms.Sunlight ✨ (@Aditiitweets) June 1, 2021
Also Read:
Viral Video: అయ్యో.! పాపం కోతి.. లెక్క తప్పింది.. బోర్లా పడింది.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video: ఈ జంతువు ఏంటో చెప్పగలరా.? భలేగా డ్యాన్స్ చేస్తోంది కదా.! వైరల్ వీడియో..
Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..