25 మంది తాలిబన్లు హతం.. మృతుల్లో 12 మంది పాకిస్థానీయులు..

ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్లకు, ఆర్మీకి మధ్య వార్‌ జరుగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా ఆఫ్ఘన్‌ సైన్యం లక్ష్యంగా తాలిబన్లు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్ సైన్యం కూడా తాలిబన్ ఉగ్రవాదుల్ని ఏరిపారేస్తోంది. తాజాగా కాందహార్‌..

25 మంది తాలిబన్లు హతం.. మృతుల్లో 12 మంది పాకిస్థానీయులు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 22, 2020 | 5:40 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్లకు, ఆర్మీకి మధ్య వార్‌ జరుగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా ఆఫ్ఘన్‌ సైన్యం లక్ష్యంగా తాలిబన్లు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్ సైన్యం కూడా తాలిబన్ ఉగ్రవాదుల్ని ఏరిపారేస్తోంది. తాజాగా కాందహార్‌ ప్రావిన్స్‌లోని తక్ట్‌ ఏ పొల్ పట్టణంలో సోమవారం రాత్రి తాలిబన్ ఉగ్రవాదులు లక్ష్యంగా నాటో రెస్క్యూ టీం ఎయిర్ స్ట్రైక్ చేపట్టింది. ఈ ఘటనలో 25 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో 12 మంది పాకిస్థానీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కాందహార్‌ పోలీసు అధికారులు తెలిపారు. మరణించిన పాకిస్థానీయులు తాలిబన్లకు సహాయంగా ఉంటూ పోరాడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల ఆఫ్ఘన్‌ ఆర్మీ పోస్టులను టార్గెట్‌ చేస్తూ తాలిబన్లు అనేక దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో సైన్యం జరిపిన దాడుల్లో దాదాపు పదుల సంఖ్యలో తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు.