Srikakulam: ఈ కచ్చిలి చేప ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
ఈ మధ్యకాలంలో మత్స్యకారుల పంట పండుతోంది. ఓ వైపు అధిక వర్షాలు కురవడంతో నదులు, కాలువలులో కూడా పలు రకాల చేపలు దొరుకుతున్నాయి. పైగా ఇవి భారీ రేటు పలుకుతుండడంతో

ఈ మధ్యకాలంలో మత్స్యకారుల పంట పండుతోంది. ఓ వైపు అధిక వర్షాలు కురవడంతో నదులు, కాలువలులో కూడా పలు రకాల చేపలు దొరుకుతున్నాయి. పైగా ఇవి భారీ రేటు పలుకుతుండడంతో జాలర్లకు కనక వర్షం కురుస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఇటీవల దొరికిన చేపలు లక్షలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఇలాంటి ఓ అరుదైన చేప లభించింది. సీహెచ్ కపాసుకుద్ధి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బైపల్లి తిరుపతిరావు సోమవారం సముద్రంలో వేటకు వెళ్లాడు. ఈయన విసిరిన వలకు ఏకంగా సుమారు 15 కిలోల కచ్చిలి చేప చిక్కింది. దీన్ని వేలం వేయగా వ్యాపారులు రూ.55 వేలకు కొనుగోలు చేశారు. దీంతో తిరుపతిరావు హర్షం వ్యక్తం చేశాడు.
కాగా అరుదుగా లభించే ఈ కచ్చిలి చేపలో ఎక్కువ ఆరోగ్య పోషకాలు ఉంటాయి .ఈ చేపల పొట్టలో ఉండే తెల్లటి నెట్టును వివిధ రకాల ఔషధాల తయారీకి ఉపయోగిస్తారని, అందుకే అంత ధరపెట్టి కొనుగోలు చేస్తారని మత్స్యకారులు చెబుతున్నారు. కాగా ఇవి ఎక్కువగా గోదావరి జిల్లాల్లో ఎక్కువగా లభిస్తాయంటున్నారు.
Also Read: IPL 2022 Mega auction: ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు.. తేదీలు, వేదిక వివరాలివే..
Saina Nehwal: హీరో సిద్ధార్థ కాక్ ట్వీట్‌పై స్పందించిన సైనా భర్త.. ఏమన్నాడంటే..
Coronavirus: ఒమిక్రాన్ బారిన పడిన స్టార్ హీరో మాజీ భార్య.. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనదంటూ..
