Saina Nehwal: హీరో సిద్ధార్థ కాక్ ట్వీట్‌పై స్పందించిన సైనా భర్త.. ఏమన్నాడంటే..
బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ
బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ, కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు, సింగర్ చిన్మయి సహా పలువురు ప్రముఖులు సైనాకు సపోర్ట్ చేస్తూ సిద్ధార్థ తీరును ఎండగట్టారు. ఒక ఒలింపియన్‌పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం నీతిమాలిచన చర్య అని సిద్ధార్థ తీరుపై మండిపడుతున్నారు. సైనా తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్ కూడా హీరో వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా సైనా భర్త, ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ సిద్ధార్థ్ ట్వీట్‌పై అసహనం వ్యక్తం చేశాడు.
హీరో సిద్ధార్థ్‌ను ట్యాగ్ చేస్తూ ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధగా ఉంది. మీ అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదు. కానీ కాస్తా మంచి పదాలు ఎంచుకోండి. ఈ విధంగా మీ అభిప్రాయాన్ని చెప్పడం చాలా బాధగా అనిపించింది. మీరు ఇవి కూల్ వర్డ్స్ అని భావించవచ్చు. కానీ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదు’ అంటూ చురకలు అంటించాడు. కాగా పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం తలెత్తిన నేపథ్యంలో సైనా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘ప్రధాన మంత్రి భద్రతకే ముప్పు వాటిల్లినపుడు మనం భద్రతగా ఉన్నామని ఎలా చెప్పుకోగలం’ అని సైనా ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన సిద్ధార్థ ‘చిన్న కాక్‌తో ఆడుతూ ప్రపంచాన్ని గెలిచినట్లు భావించే ఓ ఛాంపియన్ ఇండియాను రక్షించే వాళ్లు ఉన్నారులే’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వీటిపై స్పందించిన సైనా ‘అతడు ఏం చెప్పాడో ఖచ్చితంగా నాకు తెలియదు. నేను ఒక నటుడిగా అతడిని ఇష్టపడతాను. కానీ ఇది మంచిది కాదు. ఆయన మంచి పదాలతో తన భావాలను వ్యక్తపరుస్తాడని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.
This is upsetting for us … express ur opinion but choose better words man . I guess u thought it was cool to say it this way . #notcool #disgraceful @Actor_Siddharth
— Parupalli Kashyap (@parupallik) January 10, 2022
Also Read:IPL 2022 Mega auction: ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారు.. తేదీలు, వేదిక వివరాలివే..
Coronavirus: ఒమిక్రాన్ బారిన పడిన స్టార్ హీరో మాజీ భార్య.. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనదంటూ..
Malavika Hegde:వేల కోట్ల అప్పులెదురైనా కుంగిపోలేదు, పారిపోలేదు.. దటీజ్ మాళవికా హెగ్డే..