Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: ఒమిక్రాన్‌ బారిన పడిన స్టార్‌ హీరో మాజీ భార్య.. ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమైనదంటూ..

కరోనా కల్లోలానికి సినీ పరిశ్రమ ఉక్కిరిబిక్కిరవుతోంది. టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్‌.. ఇలా అన్ని రంగాలకు చెందిన తారలందరూ మహమ్మారి బారిన పడుతున్నారు.

Coronavirus: ఒమిక్రాన్‌ బారిన పడిన స్టార్‌ హీరో మాజీ భార్య.. ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమైనదంటూ..
Follow us
Basha Shek

|

Updated on: Jan 11, 2022 | 7:29 PM

కరోనా కల్లోలానికి సినీ పరిశ్రమ ఉక్కిరిబిక్కిరవుతోంది. టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్‌.. ఇలా అన్ని రంగాలకు చెందిన తారలందరూ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక బాలీవుడ్‌లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే కరీనాకపూర్‌, అర్జున్‌ కపూర్‌, ఏక్తా కపూర్‌, జాన్ అబ్రహం దంపతులు, మృణాళ్‌ ఠాకూర్‌, ఇషా గుప్తా, స్వరాభాస్కర్‌ తదితరులు కరోనా కోరలకు చిక్కారు. తాజాగా బాలీవుడ్‌ గ్రీక్‌ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య, ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ సుసానే ఖాన్‌ కొవిడ్‌ బారిన పడింది. ఈ విషయాన్నిఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

‘కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్నాను. కానీ మూడో సంవత్సరం ఈ మొండిఘటమైన ఒమిక్రాన్‌ వేరియంట్‌ నా రోగనిరోధక వ్యవస్థలోకి చొరబడింది. నేను సోమవారం రాత్రి పరీక్ష చేసుకోగా పాజిటివ్‌ అని తేలింది. ఇది చాలా ప్రమాదకరమైంది. దయచేసి అందరూ సురక్షితంగా ఉండి జాగ్రత్తలు తీసుకోండి.’ అని పేర్కొంది సుసానే ఖాన్‌. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘త్వరగా కోలుకో’ అని బిపాసా బసు ఆకాంక్షించగా ‘గెట్‌ వెల్‌ సూన్‌’ అంటూ డైరెక్టర్‌ ఫరాఖాన్‌ పేర్కొంది. కాగా నిన్న(జనవరి 10)న హృతిక్‌ పుట్టిన రోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ‘నువ్వు చాలా అద్భుతమైన తండ్రివి. నీలాంటి తండ్రి ఉండటం రే అండ్‌ రిడ్జ్‌ల అదృష్టం. నీ కలలన్నీ నెరవేరుతాయి. ఇప్పటికీ ఎప్పటికీ బిగ్‌ హగ్‌ ‘ అంటూ మాజీ భర్తకు బర్త్‌ డే విషెస్‌ చెప్పుకొచ్చింది సుసానే.

View this post on Instagram

A post shared by Sussanne Khan (@suzkr)

Also Read: Malavika Hegde:వేల కోట్ల అప్పులెదురైనా కుంగిపోలేదు, పారిపోలేదు.. దటీజ్‌ మాళవికా హెగ్డే..

Saina Nehwal: హీరో సిద్ధార్థకు కౌంటరిచ్చిన సైనా తండ్రి.. అతను దేశం కోసం ఏం చేశాడంటూ..

Coronavirus: కరోనా బారిన పడిన టీమిండియా ఆల్‌రౌండర్‌.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం..