AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Finger Nail: మీరు ఎంతకాలం జీవిస్తారో మీ గోర్లు చెబుతాయట..! డాక్టర్‌ పరిశోధనలో షాకింగ్‌ విషయాలు..

గోళ్ల పెరుగుదలకు జీవితకాలంతో సంబంధం ఉంటుందని మీకు తెలుసా..?అవును.. మీ దీర్ఘాయువు రహస్యం మీ చేతుల్లోనే దాగి ఉంది. మీ గోర్లు మీ వయస్సు, ఆరోగ్యాన్ని సూచించగలవా? అంటే అవును అనే అంటున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు. వీరి పరిశోధన ప్రకారం.. గోళ్ల పెరుగుదల మీ దీర్ఘాయువు, ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు ఒక వైద్యుడు చేసిన పరిశోధన ద్వారా ఈ విషయం వెల్లడైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Finger Nail: మీరు ఎంతకాలం జీవిస్తారో మీ గోర్లు చెబుతాయట..! డాక్టర్‌ పరిశోధనలో షాకింగ్‌ విషయాలు..
Finger Nail
Jyothi Gadda
|

Updated on: Feb 27, 2025 | 6:07 PM

Share

మరణం.. ఎప్పుడు, ఎవరికీ ఎలా సంభవిస్తుందో తెలియదు.. కానీ, ప్రతి ఒక్కరూ తాము ఎంతకాలం జీవిస్తామో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటారు.. మనం ఎవరినైనా ఇలా అడిగినప్పుడు, మనకు దొరికే సమాధానం ఏమిటంటే జీవితం, మరణం రెండూ ఆ దేవుడి చేతుల్లోనే ఉన్నాయి అంటారు. కానీ, మీరు ఎంతకాలం జీవించబోతున్నారనే దానికి సంబంధించి, జీవితానికి, మరణానికి మధ్య సంబంధం మీ గోళ్లలోనే దాగి ఉందని తెలిస్తే మీరు నమ్ముతారా..? అవును..హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డేవిడ్ సింక్లైర్ ఈ షాకింగ్ వాస్తవాన్ని వెల్లడించారు.

గోర్ల పెరుగుదల ఆధారంగా మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలుస్తుంది.!:

ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు, అతని జీవితం ఎంతకాలం ఉంటుంది అనే ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు. దీనికి సమాధానం ఇప్పుడు జన్యుశాస్త్ర నిపుణుడు డాక్టర్ డేవిడ్ సింక్లెయిర్ కనుగొన్నారు. అవును, ఒక అధ్యయనం ప్రకారం, గోళ్ల ఆరోగ్యం, పెరుగుదల ఒక వ్యక్తి జీవితకాలాన్ని నిర్ణయిస్తుందని, అతను ఎప్పుడు చనిపోతాడో చెబుతాయని వారు కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎవరు ఎక్కువ కాలం జీవిస్తారు?:

గోళ్ల ఆరోగ్యం శరీరంలో కొత్త కణాలు ఏర్పడే వేగాన్ని చూపిస్తుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ డేవిడ్ సింక్లెయిర్ వెల్లడించారు. మీ గోర్లు వేగంగా పెరుగుతున్నట్లయితే, మీ వయస్సు నెమ్మదిగా పెరుగుతుందని తెలుసుకోండి. అంటే మీరు ఎక్కువ కాలం జీవించబోతున్నారని అర్థం. అటువంటి పరిస్థితిలో మీరు మీ గోళ్ల పెరుగుదలను గమనించాలి. తద్వారా మీరు ఎక్కువ కాలం జీవిస్తారో లేదో మీ వయస్సును తెలుసుకోవచ్చు.

ఎవరు త్వరగా చనిపోతారు?:

అదే సమయంలో, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డేవిడ్ సింక్లైర్ మాట్లాడుతూ, గోర్లు నెమ్మదిగా పెరిగే వ్యక్తులు త్వరగా వృద్ధాప్యం చెందుతారని అన్నారు. ఇది ఆ వ్యక్తుల వయస్సు సాపేక్షంగా తగ్గుతుందని సూచిస్తుంది డాక్టర్ డేవిడ్ సింక్లెయిర్ వెల్లడించారు. గోళ్ల పెరుగుదల కూడా వ్యక్తి తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్ చెప్పారు. ఒక వ్యక్తి గోళ్లను చూడటం ద్వారా, అతని లోపల అభివృద్ధి చెందుతున్న వ్యాధిని కూడా గుర్తించవచ్చని డాక్టర్ చెప్పారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us