AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day gift: భార్యకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన భర్త.. ఆ ఇల్లాలి రియాక్షన్‌తో దెబ్బకు లగ్జరీ కారు చెత్తడబ్బాలోకి..

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ వ్యక్తి తన భార్యను సంతోషపెట్టడానికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చాడు. ఏకంగా రూ.27 లక్షల విలువైన పోర్స్చే మకాన్ కారును బహుమతిగా ఇచ్చాడు. భర్త ఇచ్చిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌కు ఆ ఇల్లాలు ఊహించని రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చింది..! ఆమె ఇచ్చిన షాక్‌కు అతడికి దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయినంత పనైంది..దీంతో ఆ కారును కాస్త తీసుకెళ్లి చెత్తను తరలించే కంటైనర్‌లో పడేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Valentine’s Day gift: భార్యకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన భర్త.. ఆ ఇల్లాలి రియాక్షన్‌తో దెబ్బకు లగ్జరీ కారు చెత్తడబ్బాలోకి..
Porsche Macan
Jyothi Gadda
|

Updated on: Feb 27, 2025 | 4:25 PM

Share

ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన భార్యకు ఎంతో ప్రేమగా సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని ప్లాన్‌ వేసుకున్నాడు ఓ వ్యక్తి.. అందుకోసం ఖరీదైన, విలాసవంతమైన కారును కానుకగా ఇవ్వాలని ఆర్డర్‌ ఇచ్చాడు. వాలెంటైన్స్‌ డే రోజు భార్యకు సర్‌ప్రైజ్‌ అంటూ కారును తీసుకొచ్చి ఇంటిముందుంచాడు..అంతే.. ఆ ఇల్లాలి రియాక్షన్‌తో ఒక్కసారిగా అతనికి ఫ్యూజ్‌లు ఔట్‌ అయినంత పనైంది..దాంతో చేసేది లేక లక్షలు పెట్టి కొన్న ఖరీదైన కారును చెత్త డబ్బాలోకి తోసేశాడు. రష్యా రాజధాని మాస్కో సమీపంలోని మైటిష్చిలో ఈ ఘటన జరిగింది.

ప్రేమికుల దినోత్సవం రోజున ఓ వ్యక్తి తన భార్యకు కానుకగా ఇచ్చేందుకు ఖరీదైన ఎస్‌యూవీ పోర్చె కారును కొనుగోలు చేశాడు. దాని ధర 3 మిలియన్‌ రూబ్లెస్‌ అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.27 లక్షలు ఉంటుంది.. తన భార్యతో తనకున్న గొడవలు, వివాదాలన్నీ ఇంతటితో ఆగిపోతాయని భావించాడు..వారి మధ్య దూరాన్ని తగ్గించుకోవాలనే ఆశతో ఖరీదైన కారును కొనుగోలు చేశాడు.. కానీ, అతని ప్రయత్నం బెడిసికొట్టింది. భార్య ఆ కారును తిరస్కరించింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఇది కొత్త కారు కాదు, ఈ కారు ఇప్పటికే ప్రమాదంలో పడి దెబ్బతింది. కారు కొన్న తర్వాత జరిగిన చిన్న ప్రమాదంలో ఆ కారుకు కొన్ని చోట్ల దెబ్బలు తగిలాయి. సొట్టలు పడడం.. పలుచోట్ల డ్యామేజ్‌ జరిగింది. అయినా కూడా తన భార్యకు ఆ కారును ఎంతో ప్రేమగా బహూకరించాడు. వాస్తవానికి అతడు మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కారు మరమ్మతు చేయించి తన భార్యకు బహుమతిగా ఇవ్వాలనేది భర్త ప్లాన్‌. కానీ, అయితే, ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే నాడు అతను తన భార్యను ఆశ్చర్యపరచడానికి ప్రయత్నించాడు, కానీ పరిస్థితులు దానికి విరుద్ధంగా మారాయి.

కారు డ్యామేజ్‌ చూసినప్పుడు ఆమెకు అవమానంగా అనిపించిందని అందుకే..ఆమె ఈ బహుమతిని స్వీకరించడానికి నిరాకరించింది. దాంతో చేసేది లేక, అతడు కారును పెద్ద చెత్తబుట్టలో పడేశాడు. చెత్తబుట్టలో కారును చూసి స్థానికులు షాక్ అయ్యారు. అయితే, అతను కారును చెత్తబుట్టలో ఎలా పెట్టాడో అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు? ఈ ఘటన జరిగి 15 రోజులకు పైగా అయ్యింది. కానీ ఈ కారు ఇంకా చెత్తబుట్టలోనే పడి ఉంది. ఈ కారు గురించి ఆ ప్రాంతమంతా చర్చ జరుగుతోంది. ఈ కారును చూడటానికి, దానితో సెల్ఫీలు దిగడానికి జనాలు వస్తున్నారు. అయితే, ఈ కారుకు ఇప్పుడు ఏమి జరుగుతుందనే దాని గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us