AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నడిరోడ్డుపై కుప్పకూలిన వైమానిక దళ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్ల దుర్మరణం!

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మర్దాన్ ప్రాంతంలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Watch Video: నడిరోడ్డుపై కుప్పకూలిన వైమానిక దళ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్ల దుర్మరణం!
Pakistan Air Force Training Aircraft
Balaraju Goud
|

Updated on: Jun 15, 2026 | 12:46 PM

Share

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మర్దాన్ ప్రాంతంలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఈ విమానం సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ప్రయాణం ప్రారంభించింది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత పైలట్లు విమానంపై నియంత్రణ కోల్పోయారు. అది నేరుగా రద్దీగా ఉండే రహదారిపై కూలిపోయింది. అయితే ప్రయాణ మధ్యలో విమానానికి సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు భావిస్తున్నారు.

విమానం నేలను తాకిన వెంటనే భారీ పేలుడు సంభవించింది. అనంతరం మంటలు చెలరేగి, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందని, వెంటనే మంటలు వ్యాపించాయని తెలిపారు. విమాన శకలాలు ప్రమాద స్థలం చుట్టుపక్కల ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడి ఉండగా, రహదారిపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాకిస్తాన్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మరణించిన విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. మృతులను కెప్టెన్ ఖాసిం, కెప్టెన్ తల్హాగా గుర్తించారు. వారి మరణంపై పాకిస్తాన్ వైమానిక దళం సంతాపం వ్యక్తం చేసింది.

ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు గల అసలు కారణాలను తెలుసుకునేందుకు పాకిస్తాన్ వైమానిక దళం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. సాంకేతిక లోపమా, లేక ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అన్న విషయాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

విమాన ప్రమాద దృశ్యాలను ఇక్కడ చూడండి…

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోజుకు రూ.333తో చేతికి రూ.17 లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారులను..
రోజుకు రూ.333తో చేతికి రూ.17 లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారులను..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
గది నుంచి బయటికి రాని కూతురు.. తలుపు బద్ధలు కొట్టి చూడగా..
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
ఇంట్లో దీపం ఏ దిశలో వెలిగిస్తే ధనలక్ష్మి కటాక్షం? ఈ ఒక్క పొరపాటు
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
IND vs AFG: సచిన్ రికార్డ్ బ్రేక్.. చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
రామకోటి ఎప్పుడు ప్రారంభించాలి? ఏ రోజు మొదలెడితే మంచిది?
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
వరాల వర్షం కురిపించనున్న రాహువు.. వీరికి రాజయోగం
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
రైల్వే స్టేషన్ ఉచిత వెయిటింగ్ రూమ్స్‌లో ఎన్ని గంటల ఉండవచ్చు..?
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
తెలుగు తెరపై క్రూరత్వం.. నిజ జీవితంలో దాతృత్వం
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..