AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ..! ఆ హీరోయిన్ ఈమేనా.!! ఎంత మారిపోయింది.. సంతోషం బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందంటే

కొందరు హీరోయిన్లు ఒకటి లేదా రెండు సినిమాలతోనే వెండితెరకు దూరమైన సందర్భాలు చాలా ఉన్నాయి. గీతాంజలి హీరోయిన్ గిరిజ మొదలుకొని ఇలాంటి వన్ ఫిలిం వండర్ హీరోయిన్లు ఎందరో ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు అందాల తార గ్రేసీ సింగ్ .

ఏంటీ..! ఆ హీరోయిన్ ఈమేనా.!! ఎంత మారిపోయింది.. సంతోషం బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందంటే
Santhosham
Rajeev Rayala
|

Updated on: Jun 15, 2026 | 12:27 PM

Share

కింగ్ నాగార్జున కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.   నాగార్జున హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం సంతోషం తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ మూవీ. ఈ సినిమాలో శ్రియాతో పాటు కథానాయికగా నటించింది అందాల భామ గ్రేసీ సింగ్.  ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అందచందాలతో, అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇక గ్రేసీ సింగ్ సంతోషం సినిమాలో కనిపించింది.. కొద్ది సమయం మాత్రమే అయినా, దేవుడే దిగివచ్చినా తాజ్‌మహల్ నాకిచ్చినా వంటి పాటలో ఆమె తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఆమె తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు గ్రేసీ సింగ్.

ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా

సంతోషం చిత్రం తర్వాత, ఆమె మరిన్ని తెలుగు సినిమాల్లో నటిస్తుందని అంతా భావించారు. అయితే అది జరగలేదు. ఆమె మోహన్‌బాబు, శ్రీకాంత్ హీరోలుగా వచ్చిన తప్పుచేసి పప్పుకూడు అనే చిత్రంలో నటించారు, ఇది ఆమెకు తెలుగులో చివరి చిత్రం. తెలుగు పరిశ్రమకు దూరమైనా, ఆమెకు హిందీతో పాటు తమిళం, మలయాళం, పంజాబీ వంటి ఇతర భాషల్లో సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్‌తో కలిసి లగాన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించారు. అలాగే గంగాజల్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి విజయవంతమైన సినిమాలలోనూ గ్రేసీ సింగ్ కీలక పాత్రలు పోషించి నటిగా తన సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత చాలా కాలానికి తెలుగులో రామ రామ కృష్ణ కృష్ణ అనే చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సరసన ఓ కీలక పాత్రలో కనిపించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది

వెండితెర ప్రయాణానికి ముగింపు పలికిన గ్రేసీ సింగ్, చివరిసారిగా 2015లో ఓ పంజాబీ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత ఆమె సిల్వర్‌స్క్రీన్‌కు పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం 44ఏళ్ల వయసున్న ఆమె పెళ్లి చేసుకోలేదు. వ్యక్తిగత జీవితంలో తనదైన మార్గాన్ని ఎంచుకున్న గ్రేసీ సింగ్, స్వతహాగా భరతనాట్యం డాన్సర్‌గా తన కళాసేవను కొనసాగిస్తున్నారు. ఆమె తన పేరు మీద గ్రేసీ సింగ్ డాన్స్ ట్రూప్ను కూడా స్థాపించారు. ఈ ట్రూప్ ద్వారా దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తూ, తన నృత్య ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు. కేవలం కళాసేవకే పరిమితం కాకుండా, ఆమె ఆధ్యాత్మిక మార్గంలోనూ పయనిస్తున్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో సభ్యురాలుగా చేరి, వారి సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని గ్రేసీ సింగ్, పండుగలు, పర్వదినాల్లో మాత్రమే తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలలో గ్రేసీ సింగ్ చాలా మారిపోయి, కాస్త బొద్దుగా కనిపించారు. ఆమె రూపాన్ని చూసిన చాలా మంది అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి : ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా

గ్రేసీ సింగ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

View this post on Instagram

A post shared by Gracy Singh (@iamgracysingh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us