AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం కళ్లుతెరిచిన వెంటనే ఏమి చూడాలి? శాస్త్రాలు చెప్పిన శుభ శకునాలు ఇవే!

Morning Rituals: నిద్రలేవగానే మంచి జరగాలంటే ఏ వస్తువులు, దృశ్యాలు చూడాలనేది ప్రాచీన ధర్మశాస్త్రం వివరిస్తుంది. ముందుగా చేతులను, బంగారు వస్తువులను, దైవాన్ని, భూమిని దర్శించుకోవాలి. వీటితో పాటు గంధపు చెక్క, మంచి నీరు, ఆవు, పక్షులు వంటివి చూడటం శుభదాయకం. ఇవి రోజును సానుకూలంగా ప్రారంభించడానికి దోహదపడతాయి.

ఉదయం కళ్లుతెరిచిన వెంటనే ఏమి చూడాలి? శాస్త్రాలు చెప్పిన శుభ శకునాలు ఇవే!
Spiritual Morning Routine
Rajashekher G
|

Updated on: Jun 15, 2026 | 10:30 PM

Share

నిద్రలేవగానే కొన్ని నిర్దిష్ట వస్తువులు లేదా దృశ్యాలను చూడటం ద్వారా రోజును శుభప్రదంగా ప్రారంభించవచ్చని ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి వివరించిన ప్రకారం, మంచి జరగాలంటే ఉదయాన్నే మనం చూడవలసిన శుభ శకునాలు ఇవి.

నిద్రలేవగానే..

ముందుగా, నిద్రలేవగానే మన అరచేతులను చూడాలి. “కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కర మూలేతు పార్వత్యాః, ప్రభాతే కర దర్శనం” అనే శ్లోకం ప్రకారం, చేతి కొనలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి, మూలంలో పార్వతీదేవి కొలువై ఉంటారు. చేతులే లోకంతో మన బంధాలను, ఇవ్వడాలు, పుచ్చుకోవడాలు, ప్రార్థనలను నిర్ణయిస్తాయి కాబట్టి ముందుగా వాటిని దర్శించాలి.

తరువాత, స్వర్ణ వస్తువులను చూడటం మంచిది. మన చేతికి ఉన్న అంగుళీయకం (ఉంగరం) లేదా స్త్రీలు మెడలో ధరించే మంగళసూత్రాన్ని చూసి కళ్ళకు అద్దుకోవాలి. ఆ పిమ్మట, దైవ దర్శనం చేయాలి. ఉదయం శ్రీకృష్ణుని నామస్మరణ చేయాలని ప్రాచీన ధర్మశాస్త్రం చెబుతోంది. “శ్రీకృష్ణ పరంధామ యదుభూషణ” అని స్మరించుకోవాలి.

ఇవి కూడా చదవండి

అనంతరం భూమిని స్తోత్రం చేసి చూడాలి. మనం అడుగు పెట్టే ముందు ఈ భూమి మనలను మోస్తున్నదని భావించి కృతజ్ఞతతో చూడటం శుభకరం. ఇవి నిత్యం చూడవలసినవి. వీటితో పాటు, గంధపు చెక్క, స్వచ్ఛమైన నీరు, రాగి పాత్రలు, ఆవు, గడ్డి, పక్షులు (ముఖ్యంగా చిలుకలు) వంటివి చూడటం కూడా శుభ ఫలితాలను ఇస్తుందని సంప్రదాయం వెల్లడిస్తుంది. ఈ దర్శనాలతో రోజును ప్రారంభించడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us