Viral Video: అంగరంగ వైభవంగా గోవుకు సీమంతం.. పేరంటాలతో సందడి చేసిన మహిళలు
మాతృత్వం మహిళకు ఓ వరం.. ప్రసవం పునర్జన్మతో సమానం. అందుకే గర్భం దాల్చిన మహిళను ఇంటిల్లిపాది అపురూపంగా చూసుకుంటారు. ఐదో నెలలో సీమంతం చేసి రకరకాల తినుబండారాలు వండి పెట్టడం మన హిందూ సంప్రాదాయంలో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే మచిలీపట్నంకు చెందిన మహిళలు మాత్రం కాస్తా వెరైటీగా ఆలోచించి గోమాతకు కూడా సీమంతం చేసి తమ జంతు ప్రేమను చాటుకున్నారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ గోపువానిపాలెంకు చెందిన మైధిలి అనే మహిళ సరికొత్త సాంప్రదాయానికి తెరలేపారు. తన ఇంట్లో పుట్టి పెరిగిన గోవు గర్భం దాల్చి తొమ్మిది నెలలు నిండటంతో తమదైన శైలిలో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. హిందువులు పవిత్రంగా పూజించే గోమాతకు సీమంతం జరిపారు. చుట్టుపక్కల వారిని పిలిచి ఘనంగా పేరంటకం నిర్వహించారు. గతంలోను ఆమె తన ఇంట్లోని గోవులకు సీమంతాలు, లేగ దూడలు పుట్టిన తర్వాత బారసాల వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించినట్లు చెబుతున్నారు స్థానికులు. సాధారణంగా గోమాతను మహిళతో సమానంగా గౌరవిస్తుంటారు. గ్రామీణ అన్నదాతలకు ఆవు ప్రయోజనకారి. అందుకే నోరులేని ఆ సాధుజంతువుకు అపురూపమైన ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచన తమకు వచ్చిందని మహిళలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..