Blue Aadhaar: ప్రభుత్వం అందించే బ్లూ ఆధార్ కార్డు పేరు విన్నారా? ఎవరి కోసం ఈ కార్డు ఇస్తుందంటే..!
ఆధార్ తో పాటు బ్లూ ఆధార్ ని కుడా అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు పొందాలన్న సబ్సిడీలు పొందాలన్నా ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఏ పని జరగాలన్నా ఆధార్ ఉండాల్సిందే.. ప్రస్తుతం పన్నెండు అంకెలు కలిగిన గుర్తింపు కార్డులను అందిస్తుంది కేంద్రం. అయితే 2018 లోనే బ్లూ ఆధార్ కార్డులను ప్రవేశ పెట్టింది. ఈ కార్డు 5 ఏళ్ల లోపు పిల్లల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే పిల్లలకు ఐదేళ్లు వయసు పూర్తి అయ్యాక మాత్రం ఈ ఆధార్ పని చెయ్యదు.
ఆధార్ ఆధార్ దేశం లో ఈ పేరు వినని తెలియని మనిషే లేరంటే అతిశయోక్తి కాదు. పుట్టిన పసికందు నుండి పండు ముసలి వరకూ ఇప్పుడు మన దేశం లో ఆధార్ తప్పనిసరి అయింది. ఏం కొనాలి అన్న ఏం అమ్మాలి అన్నా ఏం చెయ్యాలి అన్నా జేబులో ఆధార్ ఉండాల్సిందే. ఇదంతా అందరికి తెలిసిన విషయమే.. అయితే ఇక్కడే ఇంకో అసలు విషయం ఉంది. ఆధార్ తో పాటు బ్లూ ఆధార్ ని కుడా అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు పొందాలన్న సబ్సిడీలు పొందాలన్నా ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఏ పని జరగాలన్నా ఆధార్ ఉండాల్సిందే..
ప్రస్తుతం పన్నెండు అంకెలు కలిగిన గుర్తింపు కార్డులను అందిస్తుంది కేంద్రం. అయితే 2018 లోనే బ్లూ ఆధార్ కార్డులను ప్రవేశ పెట్టింది. ఈ కార్డు 5 ఏళ్ల లోపు పిల్లల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే పిల్లలకు ఐదేళ్లు వయసు పూర్తి అయ్యాక మాత్రం ఈ ఆధార్ పని చెయ్యదు. మళ్ళీ తిరిగి రెగ్యులర్ ఆధార్ తీసుకోవాల్సిందే.. సాధారణ ఆధార్ మాదిరిగానే వేలిముద్రలు రెటీనా వివరాలను బ్లూ కార్డులో పొందుపరిచి అప్డేట్ చేస్తారు.
పుట్టిన పిల్లలకు బ్లూ ఆధార్ తీసుకోవడానికి తల్లితండ్రులు తమ ఆధార్ తో పాటు కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం అడ్రస్ ప్రూఫ్ తో పాటు పిల్లల బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు పొందటానికి తల్లిదండ్రులు అవసరమైన డాక్యుమెంట్లతో దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సంప్రదించాలి. కార్డుపై ప్రింట్ చేసేందుకు ఆధార్ సెంటర్ లో చిన్నారుల ఫొటో కూడా తీస్తారు. అన్ని వివరాలు వెరిఫై చేసిన తర్వాత 60 రోజుల్లోపు బ్లూ ఆధార్ ఇస్తారు.
అసలు బ్లూ ఆధార్ తో ఉపయోగం ఏంటి సాధారణ ఆధార్ కు దీనికి తేడా ఏమిటంటే.. బ్లూ ఆధార్ కేవలం చిన్న పిల్లలకు మాత్రమే ఉపయోగపడుతుంది. బ్లూ ఆధార్ వల్ల పిల్లలకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు వెసులుబాటును పొందవచ్చు. పాఠశాల్లలో అడ్మిషన్ కోసం కూడా బ్లూ ఆధార్ ఉపయోగిస్తారు. కనుక పుట్టిన పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కోసం పిల్లలకు బ్లూ ఆధార్ తీసుకోండి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..