AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Halal Products: హలాల్ సర్టిఫికేషన్ ఉత్పత్తులపై విచారణ.. 4 సంస్థల సహా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు

దేశంలో ఆహార పదార్థాల ధృవీకరణను భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) చేస్తుంది. హలాల్ సర్టిఫికేషన్ కోసం నాలుగు ప్రత్యేక సంస్థలు కూడా ఉన్నాయి. అవి జమియత్ ఉలేమా-ఎ-హింద్ హలాల్ ట్రస్ట్, హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హలాల్ సర్టిఫికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,  జమియత్ ఉలేమా-ఎ-మహారాష్ట్ర. అయితే యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తున్నారు.. అంతేకాదు తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జమియత్ హలాల్ ట్రస్ట్ తెలిపింది.

Halal Products: హలాల్ సర్టిఫికేషన్ ఉత్పత్తులపై విచారణ.. 4 సంస్థల సహా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు
Halal Products
Surya Kala
|

Updated on: Nov 20, 2023 | 5:38 PM

Share

ఉత్తర్ ప్రదేశ్ లో హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయాలపై నిషేధం విధిస్తూ గత శనివారం యోగి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నేటి నుంచి హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులను పరీక్షించడం మొదలు పెట్టింది. ఇందుకోసం ఆహార, ఔషధ శాఖ ఇన్ స్పెక్టర్లు మార్కెట్లకు వెళ్లి విచారణ ప్రారంభించారు.

దేశంలో ఆహార పదార్థాల ధృవీకరణను భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) చేస్తుంది. హలాల్ సర్టిఫికేషన్ కోసం నాలుగు ప్రత్యేక సంస్థలు కూడా ఉన్నాయి. అవి జమియత్ ఉలేమా-ఎ-హింద్ హలాల్ ట్రస్ట్, హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హలాల్ సర్టిఫికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,  జమియత్ ఉలేమా-ఎ-మహారాష్ట్ర. అయితే యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తున్నారు.. అంతేకాదు తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జమియత్ హలాల్ ట్రస్ట్ తెలిపింది. తమకు హలాల్ ఉత్పత్తులను ధృవీకరణ చేయడానికి భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని ట్రస్ట్ చెబుతోంది.

దేశవ్యాప్తంగా హలాల్ ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్

యూపీలో హలాల్ వస్తువులను నిషేధించిన తరువాత బజరంగ్ దళ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హలాల్ ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ ఉత్పత్తులతో వచ్చిన డబ్బుతో ఉగ్రవాదులకు , వారి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయని భజరంగ్ దళ్ ఆరోపిస్తోంది. ఇదే  కేసులో యూపీ పోలీసులు నేడు పేరున్న నాలుగు సంస్థలకు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు లక్నో పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

నోటీసులు అందుకున్న సంస్థలు ఏమిటంటే..

హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: ఈ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వేతర కంపెనీగా పని చేస్తుంది. ఈ సంస్థ  ఆగస్టు 5, 2009న స్థాపించబడింది. పాండిచ్చేరిలో రిజిస్టర్ చేయబడింది. ఈ కంపెనీకి 3 ప్రమోటర్లు ఉన్నారు. అబ్దుల్ జమీల్ మొహమ్మద్ జిన్నా, అబ్దుల్ వాసిం షేక్ దావూద్, ముజఫరుల్లా. హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా అబ్దుల్ జమీల్ మహ్మద్ జిన్నా , అబ్దుల్ వాసిమ్ షేక్ దావూద్ నియమితులయ్యారు.

హలాల్ సర్టిఫికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: ఈ సంస్థ భారతదేశంలో విస్తృతంగా స్థాపించబడిన మొట్టమొదటి హలాల్ ధృవీకరణ సంస్థ. 1999 నుండి దేశంలో పనిచేయడం మొదలు పెట్టింది. ఈ సంస్థ హలాల్ ధృవీకరణను అందిస్తుంది.. ఇస్లాం అనుచరులకు ఆహారం, ఉత్పత్తులను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఆధునిక ప్రపంచంలో హలాల్ సమగ్రతను కాపాడుకునే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ఈ కంపెనీ తెలిపింది.

జమియత్ ఉలేమా ఇ హింద్ హలాల్ ట్రస్ట్: జమియాత్ ఉలామా-ఎ-హింద్ హలాల్ ట్రస్ట్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. ఇది 1919లో స్థాపించబడిన అతిపెద్ద పురాతన సంస్థ. ఇది ముస్లిం NGO ద్వారా నిర్వహిస్తున్నారు.  ఇది భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన, విశ్వసనీయమైన, ప్రసిద్ధ సంస్థలలో ఒకటి. రెస్టారెంట్లు, హోటళ్లు, ఆసుపత్రులు, ఆహారం, స్లాటర్ హౌస్‌లు, ఇతర హలాల్ ధృవీకరణ సంబంధిత సేవలకు హలాల్ ధృవీకరణను ఈ సంస్థ అందిస్తోంది. అంతేకాదు భారతదేశంలోని వివిధ ప్రదేశాలో ఏడు ఆఫీసుల్లో విధులు  నిర్వహిస్తోంది.

జమియత్ ఉలేమా ఇ మహారాష్ట్ర:  ఇది జమియాత్ ఉలమా-ఎ-హింద్ లోని ఒక శాఖ. ఇస్లామిక్ విశ్వాసాలు, గుర్తింపు, వారసత్వం, ప్రార్థనా స్థలాలను రక్షించడం దీని విధి. అంతేకాదు ముస్లింల పౌర, మత, సాంస్కృతిక, విద్యా హక్కులను పరిరక్షించడం దీని పని. ముస్లిం కమ్యూనిటీ కోసం పనిచేస్తున్న ఈ ఎన్జీవో హిందూ విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్ కూడా ఇస్తుందని చెప్పారు.

నిబంధనలు పాటించని వారిపై చర్యలు

సీఎం యోగి నుండి సూచనలు అందుకున్న తరువాత సహరాన్‌పూర్ జిల్లా యంత్రాంగం హలాల్ సర్టిఫికేట్‌తో ఉత్పత్తులను తనిఖీ చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. హలాల్ సర్టిఫికేట్‌తో ఉత్పత్తులను తనిఖీ చేయాలని జిల్లాలోని అన్ని ఎస్‌డిఎంలు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌తో పాటు డ్రగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 14 మంది అధికారుల బృందాన్ని ఆదేశించినట్లు సహరాన్‌పూర్ డిఎం డాక్టర్ దినేష్ చంద్ర సింగ్ తెలిపారు. సహరాన్‌పూర్ జిల్లాలోని మాల్స్, రెస్టారెంట్లు, మందుల షాపులతో పాటు ఇతర షాపులను కూడా తనిఖీ చేయనున్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే, నిబంధనల ప్రకారం సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..