AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur General Hospital: కార్పోరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా జీజీహెచ్.. కోట్లాది రూపాయలతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు

వైద్యం ఖరీదు కావటమే కాకుండా సాంకేతిక పరికరాలపై అధికంగా ఆధారపడటం చూస్తున్నాం. రోగ నిర్ధారణ చేయాలన్నా అత్యాధునిక పరికరాలపైనే ఆధారపడుతున్న పరిస్థితులున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాలకు చికిత్స చేసే సమయంలో పెట్ స్కాన్, సిటి స్కాన్, లీనియర్ యాక్సిలేటర్ వంటి అధునాతన పరికరాలు కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. ఇటువంటి పరకరాలు కార్పోరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. దీంతో పేదవాడకి వైద్యం చేసే క్రమంలో..

Guntur General Hospital: కార్పోరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా జీజీహెచ్.. కోట్లాది రూపాయలతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు
Guntur General Hospital
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 20, 2023 | 1:50 PM

Share

గుంటూరు, నవంబర్‌ 20: వైద్యం ఖరీదు కావటమే కాకుండా సాంకేతిక పరికరాలపై అధికంగా ఆధారపడటం చూస్తున్నాం. రోగ నిర్ధారణ చేయాలన్నా అత్యాధునిక పరికరాలపైనే ఆధారపడుతున్న పరిస్థితులున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాలకు చికిత్స చేసే సమయంలో పెట్ స్కాన్, సిటి స్కాన్, లీనియర్ యాక్సిలేటర్ వంటి అధునాతన పరికరాలు కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. ఇటువంటి పరకరాలు కార్పోరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. దీంతో పేదవాడకి వైద్యం చేసే క్రమంలో అనేక సమస్యలను ప్రభుత్వ వైద్యులు ఎదుర్కొంటున్నారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ వాటికి ధీటుగా మారుస్తుంది. కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత అధునాతన పరికరాలను గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తుంది. ఏడాది కాలంలో యాభై కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలను మంజూరు చేసింది. వాటిని ఏర్పాటు చేయడమే కాకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వాటి ద్వారా పరీక్షలు చేస్తున్న నేపధ్యంలో జీజీహెచ్‌లో ఉంది.

క్యాన్సర్ పరీక్షలో ఉపయోగపడే పెట్ స్కాన్ పరికరాన్ని 25 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారు. పెట్ స్కాన్ ను రెండు నెలల క్రితమే జీజీహెచ్ లోని నాట్కో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేశారు. అదే విధంగా రేడియేషన్ ఇచ్చే లీనియర్ యాక్సిలేటర్ పరికరాన్ని 15 కోట్లు రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు జిజిహెచ్ సూపరింటిండెంట్ కిరణ్ తెలిపారు. వీటితో పాటు 4 కోట్ల రూపాయల విలువైన సిటీ స్కాన్ ఏర్పాటు చేశారు. వీటికి అనుబంధంగా ఉండే సీఆర్మ్ పరికరాన్ని 40 లక్షల రూపాయలతో కొనుగోలు చేశారు. 25 లక్షల రూపాయల వెచ్చించి కొలనోస్కోపి, 30 లక్షల రూపాయలతో ఏబీజీ మిషన్, 25 లక్షల ఖరీదు చేసే మైక్రో స్కోప్, 20 లక్షలతో ఏకో మిషన్ ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ అధునాతన పరికరాలు అందుబాటులో ఉండటంతో రోగాన్ని ఖచ్చితంగా నిర్ధారించడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని సూపరింటిండెంట్ కిరణ్ తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం క్రుత నిశ్చయంతో ఉందని కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. వీటితో పాటు 80 కోట్ల రూపాయలతో జీజీహెచ్ మదర్ అండ్ ఛైల్డ్ హెల్డ్ సెంటర్ నిర్మిస్తున్నామన్నారు. సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఉపయోగించే అన్ని పరకరాలను ప్రభుత్వం జీజీహెచ్ లో ఏర్పాటు చేసిందని రానున్న రోజుల్లో మరింతగా పేదలకు సేవ చేసేందుకు సిబ్బంది కూడా సిద్దంగా ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా జిజిహెచ్ మరింత పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తామని తెలిపారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.