Diya Importance: హిందూ ధర్మంలో దీపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా.. రోజూ ఇంట్లో దీపాలు ఎందుకు వెలిగించాలంటే..

ఇటీవల ఇంట్లో రోజూ దీపారాధ చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. పూర్వం మన పెద్దలు మట్టి దీపాలను ఉపయోగించేవారు. ఇప్పుడు మార్కెట్లో వివిధ రంగులలో దీపాలు  లభిస్తుంది. కృత్రిమ లైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాస్తవానికి ఇటువంటి దీపాలను వెలిగించడం వలన ఎటువంటి ఉపయోగం ఏమీ ఉండదు. ఇంట్లో వెలిగించే దీపం వలన కాంతి, అందం, మానసిక ప్రశాంతత కలిగేలా ఉండాలి. కనుక రోజూ దీపాన్ని నువ్వుల నూనె, ఆవు నెయ్యి వంటి వాటితో వెలిగించాలి.

Diya Importance: హిందూ ధర్మంలో దీపం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా.. రోజూ ఇంట్లో దీపాలు ఎందుకు వెలిగించాలంటే..
Lit Oil Lamp
Follow us
Surya Kala

|

Updated on: Nov 20, 2023 | 4:05 PM

హిందూ సనాతన ధర్మంలో పూజాదికార్యక్రమాలకు విశిష్ట స్థానం ఉంది.  పండగలు, పర్వదినాల్లో మాత్రమే కాదు శుభకార్యకల్లో కూడా దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అందుకే దీపాన్ని.. జ్యోతిగా పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి కేంద్రంగా భావిస్తారు. అంతేకాదు చీకటి నుంచి వెలుగులోకి దారి చూపే దీపానికి విశేష ప్రాముఖ్యత ఉంది. వాస్తవానికి దీపం అనే పదం రెండక్షరాలు అయినప్పటికీ.. దీని అర్థం మాత్రమే ప్రత్యేకమైనది. అయితే చాలామంది దీపావళి నుంచి దీపాలు వెలిగించడం మొదలు కార్తీక మాసంలో మాత్రమే దీపాలను వెలిగిస్తారు. అయితే దీపాన్ని ఏడాదిలో ఒక్క నెలలో మాత్రమే కాదు.. రోజు కూడా అందరూ వెలిగించవచ్చు. అయితే ఏ కారణంతో దీపం వెలిగించాలి? దీని ప్రాముఖ్యత ఏమిటి? అనే ప్రశ్న తలెత్తవచ్చు. అటువంటి ప్రశ్నలకు సమాధానంగా దీప ప్రాముఖ్యత గురించి ఈ రోజు తెలుసుకోవచ్చు.

దీపం అంటే శాంతి, శ్రేయస్సు, సంపద. దీపం అంటే ప్రకాశం. దీపం జీవితంలో ఒక భాగం. కనుక ప్రతిరోజూ దీపం వెలిగించడం వల్ల జీవితంలో సుఖ శాంతులు లభిస్తాయనడంలో సందేహం లేదు. భారతీయ హిందూ సంస్కృతిలో కూడా దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీపం వెలిగించడం వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అలాగే ప్రతి కార్యక్రమం లేదా పూజ కైంకర్యాలను దీపం వెలిగించడం ద్వారా ప్రారంభిస్తారు. అయితే ఎంతటి పేరు ప్రఖ్యాతలున్నవారు అయినా సరే దీపం వెలిగించే సమయంలో పాదరక్షలు తీయాల్సిందే. దీపానికి ఉన్న ప్రాముఖ్యత అదే. ఇంట్లో దీపం వెలిగించడం వల్ల మనసుకు శాంతి, ఇంట్లో ప్రశాంతత, సానుకూల వాతావరణం పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది.

అయితే ఇటీవల ఇంట్లో రోజూ దీపారాధ చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. పూర్వం మన పెద్దలు మట్టి దీపాలను ఉపయోగించేవారు. ఇప్పుడు మార్కెట్లో వివిధ రంగులలో దీపాలు  లభిస్తుంది. కృత్రిమ లైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాస్తవానికి ఇటువంటి దీపాలను వెలిగించడం వలన ఎటువంటి ఉపయోగం ఏమీ ఉండదు. ఇంట్లో వెలిగించే దీపం వలన కాంతి, అందం, మానసిక ప్రశాంతత కలిగేలా ఉండాలి. కనుక రోజూ దీపాన్ని నువ్వుల నూనె, ఆవు నెయ్యి వంటి వాటితో వెలిగించాలి. అందులోనూ దేవుడి గదిలో ఇలా దీపం వెలిగించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది.  ప్రతిరోజూ కనీసం రెండు ఒత్తులతో నెయ్యి, నూనెతో దీపాన్ని వెలిగించి దేవుడికి సమర్పించాలి.

ఇవి కూడా చదవండి

తులసి పూజ సమయంలో దీపం వెలిగించడానికి కారణం ఏమిటి?

హిందూమతంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో తులసిని పూజించడం వల్ల మీ సంపద పెరుగుతుందని.. జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ మాసంలో విష్ణువు నాలుగు నెలల యోగ నిద్ర నుండి మేల్కొంటాడని చెబుతారు. కనుక ఈ మాసానికి పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. చాలా ప్రత్యేకమైనదిగా కూడా పరిగణించబడుతుంది. కార్తీక మాసంలో కూడా తులసి చెట్టు ముందు దీపం వెలిగించడం శుభప్రదం, ప్రతిరోజూ తులసి మొక్క ముందు దీపాన్ని ఉదయం సాయంత్రం వెలిగించడం శుభప్రదమని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!