Astro Tips: ఈ రాశికి చెందిన వ్యక్తులు సీతాకోక చిలుక నేచర్ కలిగి ఉంటారు.. త్వరగా బ్రేకప్ చెబుతారు..
కొంతమంది స్నేహితులైన, భార్యాభర్తలైనా, ప్రేమికులైనా సంతోషంగా ఉంటూ.. ఆ బంధాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటారు. అయితే కొందరు సంబంధం విషయంలో నిత్యం గందరగోళంగా ఉంటూ.. ఎవరితోనూ లాంగ్ రిలేషన్ షిప్ ని కొనసాగించలేక తొందరగానే ఈ బంధానికి ముగింపు పలుకుతారు. వాస్తవంగా చెప్పాలంటే ఏ విషయంపైనా సరైన అవగాహన లేక ఎక్కువగా బ్రేక్ అప్ చెబుతూ సరికొత్త బంధం కోసం పరుగులు పెడుతూ ఉంటారు. ఈ రోజు అటువంటి వ్యక్తిత్వం కలిగిన కొన్ని రాశుల గురించి తెలుసుకుందాం..
మనుషుల ఆలోచనాతీరు, ప్రవర్తన, కష్ట, సుఖాలు అన్నీ పుట్టిన తేదీ, సమయం రాశులను బట్టి ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. కొందరు చిన్న చిన్న విషయాలకే సంతోష పడితే.. మరికొందరు ఎంత ఉన్నా ఏదో పొట్టుకున్నట్లు ఉంటారు. అదే విధంగా కొంతమంది స్నేహితులైన, భార్యాభర్తలైనా, ప్రేమికులైనా సంతోషంగా ఉంటూ.. ఆ బంధాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటారు. అయితే కొందరు సంబంధం విషయంలో నిత్యం గందరగోళంగా ఉంటూ.. ఎవరితోనూ లాంగ్ రిలేషన్ షిప్ ని కొనసాగించలేక తొందరగానే ఈ బంధానికి ముగింపు పలుకుతారు. వాస్తవంగా చెప్పాలంటే ఏ విషయంపైనా సరైన అవగాహన లేక ఎక్కువగా బ్రేక్ అప్ చెబుతూ సరికొత్త బంధం కోసం పరుగులు పెడుతూ ఉంటారు. ఈ రోజు అటువంటి వ్యక్తిత్వం కలిగిన కొన్ని రాశుల గురించి తెలుసుకుందాం..
సంబం కోలాహలంలో, కొంతమంది ఇతరులకన్నా ఎక్కువ బ్రేకప్‌లను ఎదుర్కొంటారు. ఈ నాలుగు రాశిచక్ర గుర్తుల లక్షణాలను తెలుసుకోండి మరియు వారి శృంగార ప్రయాణాలు ఎందుకు కొంచెం అల్లకల్లోలంగా ఉంటాయో తెలుసుకోండి:
మేషరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కోపం ఎక్కువ. అంతేకాదు చిన్న చిన్న విషయాలకు కూడా వెంటనే కోపం తెచ్చుకునే స్వభావానికి పేరు గాంచిన వారు. వీరి కోపం వలన తర్వాత వచ్చే పర్యవసానాల గురించి పెద్దగా ఆలోచించరు. అదే విధంగా తాము ఏర్పరచుకునే సంబంధాల విషయంలోనూ ఉంటారు. వీరి అభిరుచికి పేరు పెట్టలేనిదైనప్పటికీ , ఇది కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలకు దారి తీస్తుంది. దీంతో ఎక్కువగా తమ భాగస్వామితో విడిపోవడానికి కారణం అవుతుంది
మిథునం :ఈ రాశికి చెందిన వ్యక్తులు సీతాకోక చిలుక వంటి నేచర్ కలిగి ఉంటారు. నిత్యం తిరుగుతూ ఉండాలని.. రంగుల రంగుల స్వప్నాలను కంటూ వైవిధ్యమైన, ఉత్సాహాన్ని కోరుకుంటారు. నిత్యం మార్పు కోసం ఆరాటపడతారు. దీంతో స్థిరమైన , దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడం వీరికి సవాలుగా మారుతుంది, ఎందుకంటే వీరు సులభంగా విసుగు చెందుతారు. కొత్త అనుభవాలను పొందడానికి ఆరాటపడతారు.
సింహ రాశి : సింహరాశి వారు ఆకర్షణీయంగా ఉంటారు. తాము పది మంది దృష్టిలో పడడానికి ఇష్టపడతారు. అయినప్పటికీ ప్రశంసలు కోసం ఆరాటపడతారు. తమ కోరిక నెరవేరడం కోసం కొన్నిసార్లు తమ భాగస్వామి అవసరాలను కూడా పక్కకు పెడతారు. ఇది విభేదాలు కారణంగా మారుతుంది. అంతే కాదు భాగస్వామితో చివరికి విడిపోవడానికి దారితీస్తుంది.
వృశ్చికరాశి : వృశ్చిక రాశివారు తీవ్రమైన, ఉద్వేగభరితమైన వ్యక్తిత్వానికి ప్రసిద్ధి. ఇది వీరికి బలం అదే సమయంలో బలహీనత కావచ్చు. వీరి లోతైన భావోద్వేగాల వలన కొన్నిసార్లు స్వాధీన తప్పిన స్వభావంతో సంబంధాలలో సవాళ్లను ఏర్పడేలా చేస్తుంది. కొన్ని సార్లు వీరి భావోద్వేగం తక్కులేక విడిపోదాం అనే ఆలోచన పార్ట్నర్ కు కలిగిస్తుంది. వీరి స్వభావం భాగస్వామితో విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు