Zodiac Signs: శని, కుజ గ్రహాల పరస్పర వీక్షణ.. ఆరోగ్యం, వాహన డ్రైవింగ్ విషయంలో ఆ రాశుల వారు జాగ్రత్త..!

కుంభరాశిలో స్వస్థానంలో ఉన్న శనీశ్వరుడు, వృశ్చిక రాశిలో స్వస్థానంలో ఉన్న కుజుడు పరస్పరం వీక్షించుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి తప్పకుండా అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. శనీశ్వరుడు దశమ దృష్టితో కుజుడిని, కుజుడు చతుర్థ దృష్టితో శనీశ్వరుడిని వీక్షించడం జరుగుతోంది. రెండు పాప గ్రహాల మధ్య ఈ పరస్పర దృష్టి వల్ల వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరగడం, అకస్మాత్తుగా తీవ్ర స్థాయి అనారోగ్యాలకు గురి కావడం, ఆహార, విహారాలు సవ్యంగా లేని కారణంగా కూడా అస్వస్థతకు గురి కావడం..

Zodiac Signs: శని, కుజ గ్రహాల పరస్పర వీక్షణ.. ఆరోగ్యం, వాహన డ్రైవింగ్ విషయంలో ఆ రాశుల వారు జాగ్రత్త..!
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 20, 2023 | 5:49 PM

ప్రస్తుతం గ్రహ సంచారంలో శని, కుజ గ్రహాలు పరస్పరం వీక్షించుకుంటున్నాయి. కుంభరాశిలో స్వస్థానంలో ఉన్న శనీశ్వరుడు, వృశ్చిక రాశిలో స్వస్థానంలో ఉన్న కుజుడు పరస్పరం వీక్షించుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి తప్పకుండా అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. శనీశ్వరుడు దశమ దృష్టితో కుజుడిని, కుజుడు చతుర్థ దృష్టితో శనీశ్వరుడిని వీక్షించడం జరుగుతోంది. రెండు పాప గ్రహాల మధ్య ఈ పరస్పర దృష్టి వల్ల వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరగడం, అకస్మాత్తుగా తీవ్ర స్థాయి అనారోగ్యాలకు గురి కావడం, ఆహార, విహారాలు సవ్యంగా లేని కారణంగా కూడా అస్వస్థతకు గురి కావడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని సమస్యలు, సంక్షోభాలు తలెత్తడం, భారీగా డబ్బు నష్టం జరగడం, దాడులు జరగడం వంటి వాటిలో ఏవైనా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలావరకు వ్యక్తిగత జాతక చక్రాలపై ఆధారపడి కూడా ఉంటుంది. గ్రహ సంచారం ప్రకారం ఏయే రాశుల వారికి ఏం జరగబోతోందన్నది ఇక్కడ వివరంగా పరిశీలిద్దాం.

  1. మేషం: పరస్పరం వీక్షించుకుంటున్న శని, కుజుల్లో కుజుడు ఈ రాశ్యధిపతి అయినందువల్ల ఈ రాశివారు తప్పకుండా వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాహనాలను వేగంగా నడపకపోవడం మంచిది. ఆహార, విహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇతరుల కలహాల్లో తలదూర్చడం వల్ల చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అధికారులతో ఆచితూచి వ్యవ హరించడం మంచిది. సైనిక, పోలీసు రంగాలకు చెందినవారు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశికి సప్తమంలో కుజుడు, దశమంలో శనీశ్వరుడు ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురి కావ లసి వస్తుంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. సతీమణి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. వాహనాలను వేగంగా నడపకపోవడం శ్రేయస్కరం. బంధుమిత్రు లకు సంబంధించి ఒకటి రెండు దుర్వార్తలు వినే సూచనలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
  3. మిథునం: ఈ రాశికి శని, కుజుల పరస్పర వీక్షణ ఎంతో అనుకూలంగానూ, యోగదాయకంగానూ ఉంది. విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమం అవుతుంది. వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశాల్లో స్థిరపడడానికి, స్థిరమైన ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. తండ్రి వైపు నుంచి భూసంబంధమైన ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. శుభ వార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
  4. కర్కాటకం: శని, కుజుల పరస్పర వీక్షణ వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో అకస్మాత్తుగా అపార్థాలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు తప్పనిసరిగా దూర ప్రాంతాలకు బదిలీ కావలసి ఉంటుంది. కొందరు అపరిచిత వ్యక్తులతో ఘర్షణలు ఏర్పడే సూచనలున్నాయి. పిల్లల విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల్లో ఒకరు ప్రమాదానికి గురి కావడం గానీ, అస్వస్థులు కావడం గానీ జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు బెడిసి కొట్టే అవకాశం ఉంది.
  5. సింహం: ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో, రోడ్డు ప్రమాదాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. విద్యుద్ఘాతం జరగడం గానీ, జారిపడడం గానీ జరగవచ్చు. బాగా దగ్గర బంధువులు కానీ, స్నేహితులు గానీ, నమ్మకస్తులు గానీ మోసగించే అవకాశం ఉంది. భారీ ధన నష్ట సూచనలున్నాయి. అపరిచితులకు, అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరగడం, అలవికాని లక్ష్యాలను అప్పగించడం వంటివి జరగవచ్చు.
  6. కన్య: ఈ రాశివారికి తప్పకుండా ధన యోగం పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. శని, కుజుల పరస్పర వీక్షణ వల్ల శత్రువులు, పోటీదార్లు, ప్రత్యర్థులు బాగా తగ్గి ఉంటారు. దీర్ఘ కాలిక అనారోగ్యం నుంచి సైతం ఉపశమనం లేదా విముక్తి లభిస్తుంది. చట్టవిరుద్ధ కార్యకలాపా లకు, అక్రమ సంపాదనకు బాగా అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలుం టాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి.
  7. తుల: ఈ రాశివారికి కూడా శని, కుజుల పరస్పర వీక్షణ వల్ల అపారమైన ధన యోగం పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు సంతృప్తికరంగా, సకాలంలో పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ మాటకు, చేతకు సమాజంలో విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
  8. వృశ్చికం: ఈ రాశివారికి శని, కుజుల పరస్పర వీక్షణ వల్ల తప్పకుండా శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. వాహన ప్రమాదాల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇతరత్రా, గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. అప్రయత్న ధన లాభ సూచనలున్నాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడం జరుగుతుంది. బంధు వర్గం నుంచి శుభ వార్తలు వింటారు. స్నేహి తులు మరింత సన్నిహితం అవుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
  9. ధనుస్సు: శని, కుజ గ్రహాల పరస్పర వీక్షణ వల్ల అనవసర ఖర్చులు, వృథా ఖర్చులు పెరగడం, కష్టార్జితంలో ఎక్కువ భాగం నష్టపోవడం, వైద్య ఖర్చులు కూడా ఇబ్బంది పెట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో డబ్బు గానీ, విలువైన వస్తువులు గానీ కోల్పోయే సూచనలున్నాయి. కొందరు సన్నిహితులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. రహస్య శత్రువులు లేదా పోటీదార్లు తయారవుతారు. కోర్టు కేసు ఒకటి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అనారోగ్యానికి అవకాశం ఉంది.
  10. మకరం: ఈ రాశివారికి శని, కుజుల వీక్షణ వల్ల అత్యధికంగా ధన లాభం చేకూరుతుంది. తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గి, ఇతరులకు ఆర్థికంగా ఉపయోగపడే స్థితిలో ఉండడం జరుగుతుంది. వృత్తి, ఉద్యో గాలలో గౌరవమర్యాదలు పెరగడంతో పాటు, అధికార యోగానికి కూడా అవకాశం ఉంటుంది. కోప తాపాలు పెరిగే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించడం మంచిది. శత్రువులు తగ్గి ఉంటారు.
  11. కుంభం: ఈ రాశివారికి ఈ రెండు గ్రహాల వీక్షణ వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. నిరు ద్యోగులకే కాకుండా ఉద్యోగులకు సైతం ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. సొంత వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కుటుంబ వ్యవహారాలు సానుకూలపడతాయి. గట్టి పట్టుదలతో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు.
  12. మీనం: ఈ రాశివారికి ఈ రెండు పాప గ్రహాల పరస్పర వీక్షణ వల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఒకటి రెండు శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. భూ సంబంధమైన ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి వ్యవహారంలో విజయం సాధిస్తారు. అయితే, బాగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. సన్నిహితుల వల్ల మోస పోయే సూచనలు కనిపిస్తున్నాయి. దగ్గర బంధువులకు సంబంధించి దుర్వార్తలు వినవచ్చు.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో