Father Upset: రూ.2 కోట్ల విలువైన ఆస్తిన జిల్లా కలెక్టర్ పేరున వీలునామా రాసిన పెద్దాయన.. విషయం తెలిస్తే షాక్!

కన్న బిడ్డలు ఆస్తి కోసం వేధించారు. కనీసం తిండి కూడా పెట్టకపోవడంతో ఆ తండ్రి విసిగిపోయి చివరకు తన ఆస్తి పాస్తులను ప్రభుత్వానికి ధారదత్తం చేశాడు.

Father Upset: రూ.2 కోట్ల విలువైన ఆస్తిన జిల్లా కలెక్టర్ పేరున వీలునామా రాసిన పెద్దాయన.. విషయం తెలిస్తే షాక్!
Old Man Donated Property
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 28, 2021 | 9:27 PM

Old Man Donated property: కన్నబిడ్డలను తల్లిదండ్రులు కంటికి రెప్పాలా కాపాడుకుని పెంచి ప్రయోజకులను చేస్తారు. వయసు మీద పడిన తర్వాత వృద్ధులు అయ్యాక ఆసరా ఉంటారనుకుంటారు. అయితే ఆ పిల్లలే.. కనీసం తిండి కూడా పెట్టకపోవడంతో ఆ తండ్రి విసిగిపోయి చివరకు తన ఆస్తి పాస్తులను ప్రభుత్వానికి ధారదత్తం చేశాడు ఓ పెద్దాయన. తన ఇద్దరు కుమారులూ సరిగ్గా పట్టించుకోకపోవడంతో కలతచెందిన ఆ తండ్రి తన పేరున ఉన్న రూ.2 కోట్ల విలువైన ఆస్తిని జిల్లా కలెక్టర్ పేరున వీలునామా రాశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆగ్రాలో చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట నేరుగా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి తన వీలునామా పత్రాలను అందజేయడంతో అక్కడ సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

ఆగ్రాలోని నీరాలబాద్‌ పీపల్‌‌మండి నిరాలాబాద్ ప్రాంతానికి చెందిన గణేశ్‌ శంకర్‌ పాండే (88) సోదరులతో విడిపోయాక తన వాటాగా 225 చదరపు గజాల స్థలం దక్కింది. సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసుకునే గణేశ్ శంకర్ పాండేకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దిగ్విజయ్‌తో కలిసి ఉంటున్నానని, ఈ ఆస్తి కోసం తరుచూ గొడవకు దిగుతుండటంతో కలత చెందాడు. ఎక్కువ భాగం తనకే ఇవ్వాలని పట్టుబట్టడంతో అతడికి చాలాసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వ్యాపారం గురించి వివరించేందుకు ప్రయత్నించినా దిగ్విజయ్ తన మాటలు వినలేదు. దీంతో తన వాటాగా దక్కిన భూమిని 2018 ఆగస్టు 4న ఆగ్రా కలెక్టర్‌ పేరు మీద వీలునామా రాశారు.

ఈ పత్రాలను కలెక్టర్‌కు అప్పగించేందుకు వచ్చిన ఆయన.. కుటుంబసభ్యులు తనను ఇంటి నుంచి తరిమేశారని గణేశ్‌ శంకర్‌ తెలిపారు. ప్రస్తుతం తన సోదరులు రఘునాథ్‌, అజయ్‌ల వద్ద తాను ఉంటున్నానని చెప్పారు. తన ఇద్దరు కుమారులు తనను పట్టించుకోకుండా వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన ఆస్తిని.. కలెక్టర్‌ పేరు మీద రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనిపై ఆగ్రా కలెక్టర్ ఏకే సింగ్ స్పందించారు. పీపల్ మండి నిరాలాబాద్‌కు చెందిన ఓ పెద్దాయన గురువారం వచ్చి ఆస్తి పత్రాలను తనకు అందజేశారన్నారు. పెద్ద కుమారుడి తీరుతో కలత చెంది మొత్తం ఆస్తిని కలెక్టర్ పేరుతో రాసినట్టు చెప్పారన్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను కూడా ఇచ్చారని తెలిపారు.

Read Also….  Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కన్నుమూత యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు : మెగాస్టార్ చిరంజీవి