Women: ప్రపంచంలో మహిళలకు అత్యంత సురక్షితమైన దేశాలు ఏంటో తెలుసా.?

సమాజంలో మహిళలపై ఎంతో కొంత చిన్నచూపు ఉంటుందనేది ఎవరూ కాదనలేని నిజం. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితే ఉందా.? అంటే కచ్చితంగా కాదని చెప్పలేం. ప్రపంచంలో కొన్ని దేశాల్లో మహిళలకు అత్యంత భద్రతతో పాటు పథకాలను అందిస్తున్నారు. ఇంతకీ ఈ జాబితాలో ఉన్న దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Women: ప్రపంచంలో మహిళలకు అత్యంత సురక్షితమైన దేశాలు ఏంటో తెలుసా.?
Women Safety
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 01, 2024 | 7:17 PM

ఏ దేశంలో అయితే మహిళలు సురక్షితంగా ఉంటారో. ఆ దేశం నిజమైన అభివృద్ధి చెందినట్లు అని అంటుంటారు. ప్రస్తుతం సమాజంలో మహిళలపై దాడులు పెరుగుతోన్న నేపథ్యంలో అసలు ప్రపంచంలోని ఏ దేశాలు మహిళలకు అత్యంత సురక్షితమైన దేశం ఏంటి..? అసలు మహిళలకు దేశాలు సురక్షితమా.? కాదా అన్న విసాలను ఎలా పరిగణిస్తారు ఇప్పుడు తెలుసుకుందాం..

మహిళలకు సురక్షితమైన దేశాన్ని పరిగణించడానికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు . మహిళలపై హింసకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉండాలి అలాగే వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి . అంతే కాకుండా విద్య, ఉద్యోగాలలో మహిళలకు సమాన అవకాశాలు దక్కాలి. అలాగే మహిళలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి . అలాగే సమాజంలో మహిళలకు సమాన హోదా రావాలి, వారి అభిప్రాయాలను గౌరవించాలి . అంతే కాకుండా దేశంలో లింగ సమానత్వం కోసం కృషి చేయాలి ఇవన్నీ ఉంటే ఆ దేశం మహిళలకు సురక్షితమైన దేశంగా చెప్పొచ్చు.

ఇక అనేక అధ్యయనాలు, సర్వేల అనంతరం ఉత్తర ఐరోపా దేశాలను ప్రపంచంలోని సురక్షితమైన దేశాల జాబితాలో చేర్చారు. చేర్చబడతాయి. ఇందులో ఐస్‌లాండ్‌ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ మహిళలకు రాజకీయాలు , వ్యాపారం ఇలా సమాజంలోని అన్ని రంగాలలో సమాన అవకాశాలు లభిస్తాయి.

నార్వే కూడా మహిళలకు అత్యంత సురక్షితమైన దేశంగా చెబుతుంటారు. ఇక్కడ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటారు. ఇక ఫిన్‌లాండ్‌లో విద్య, ఉపాధి మహిళలకు సమాన అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ మహిళల రాజకీయ భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. స్వీడన్‌లో మహిళల కోసం అనేక రకాల సామాజిక భద్రతా పథకాలు ఉన్నాయి. ఇక్కడ స్త్రీలకు ప్రసూతి సెలవులు, శిశు సంరక్షణ సౌకర్యాలు అందిస్తారు. డెన్మార్క్‌లో, లింగ సమానత్వం కోసం మహిళలకు అనేక చట్టపరమైన రక్షణలు అందించారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!