Astrology: నక్షత్ర పరివర్తన.. ఆ రాశుల వారికి పోటా పోటీగా శుభ ఫలితాలు

శని, రాహువుల మధ్య నక్షత్ర పరివర్తన చోటు చేసుకుంటోంది. రాహువుకు చెందిన శతభిషా నక్షత్రంలో శనీశ్వరుడు, శనికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం ప్రారంభించి నందువల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. డిసెంబర్ 27 వరకూ కొనసాగబోతున్న ఈ నక్షత్ర పరివర్తన కాలంలో శని, రాహువులు రెండూ పోటా పోటీగా ఉత్తమ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.

Astrology: నక్షత్ర పరివర్తన.. ఆ రాశుల వారికి పోటా పోటీగా శుభ ఫలితాలు
Nakshatra Parivartan
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 01, 2024 | 6:59 PM

శని, రాహువుల మధ్య నక్షత్ర పరివర్తన చోటు చేసుకుంటోంది. రాహువుకు చెందిన శతభిషా నక్షత్రంలో శనీశ్వరుడు, శనికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం ప్రారంభించి నందువల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. డిసెంబర్ 27 వరకూ కొనసాగబోతున్న ఈ నక్షత్ర పరివర్తన కాలంలో శని, రాహువులు రెండూ పోటా పోటీగా ఉత్తమ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం శని, రాహువులు అనుకూలంగా ఉన్నవారికి మరింత శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. వృషభం, మిథునం, వృశ్చికం, మకరం, కుంభ రాశులకు ఇది వంద శాతం వర్తించే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి లాభస్థానంలో ఉన్న రాహువు, దశమ స్థానంలో ఉన్న శని మధ్య నక్షత్ర పరివర్తన జరి గినందువల్ల ఉద్యోగపరంగా అనేక లాభాలు చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు. జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి కూడా ఆఫర్లు అందే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
  2. మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న శనికి, దశమ స్థానంలో ఉన్న రాహువుకు మధ్య నక్షత్ర పరివర్తన జరిగినందువల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా అందు తాయి. విదేశీ సొమ్మును అనుభవించే యోగం తప్పకుండా పడుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. ఆస్తి సంబంధమైన వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. తండ్రి నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశాలు ఉన్నాయి.
  3. వృశ్చికం: ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో ఉన్న శని, రాహువుల మధ్య కొద్దిపాటి పరివర్తన జరిగినందు వల్ల ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం బాగా వృద్ధి చెందుతాయి. ఆశించిన స్థాయిలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటారు. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి.
  4. మకరం: ఈ రాశికి ధన, తృతీయ స్థానాల్లో ఉన్న గ్రహాల మధ్య నక్షత్ర పరివర్తన జరిగినందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ ఉత్తమ ఫలితాలనిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవే రుతుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నిరుద్యోగులకు రెండుమూడు సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడం జరుగుతుంది.
  5. కుంభం: రాశినాథుడితో ధన స్థానంలో ఉన్న రాహువుకు నక్షత్ర పరివర్తన జరిగినందువల్ల, అనేక విధా లుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో జీత భత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బును వసూలు చేసుకుంటారు. ఆర్థిక సమ స్యల నుంచి, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ శాంతులు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?