ఈ రోజు గోవర్ధన పూజ, శుభ సమయం, పూజా విధానం, మంత్రం వరకు పూర్తి వివరాలు మీ కోసం

ఈ సంవత్సరం గోవర్ధన్ పూజ పండుగను ఈ రోజు అంటే నవంబర్ 2 వ తేదీ శనివారం జరుపుకుంటున్నారు. మీరు కూడా గోవర్ధన్ పూజ కోసం సిద్ధమవుతున్నట్లయితే ఈరోజు గోవర్ధన పూజకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే గోవర్ధన్ పూజ శుభ సమయం, పూజా విధానం, సమర్పించాల్సిన ఆహారం, చదవాల్సిన మంత్రం అన్ని తెలుసుకుందాం..

ఈ రోజు గోవర్ధన పూజ, శుభ సమయం, పూజా విధానం, మంత్రం వరకు పూర్తి వివరాలు మీ కోసం
Govardhan Puja
Follow us
Surya Kala

|

Updated on: Nov 02, 2024 | 6:46 AM

కార్తీక మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి తిధి రోజున గోవర్ధన పూజ పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి మరుసటి రోజున గోవర్ధన్ పూజ జరుపుకుంటారు. అయితే కొన్నిసార్లు గోవర్ధన్ పూజ పండుగ, దీపావళి మధ్య ఒక రోజు గ్యాప్ ఉంటుంది. ఈసారి కూడా అదే జరిగింది. ఈసారి కార్తీక అమావాస్య తిథి రెండు రోజులు రావడంతో దీపావళిని రెండు రోజులు జరుపుకున్నారు. అటువంటి పరిస్థితిలో వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం గోవర్ధన్ పూజ ఈ రోజు అంటే 2 నవంబర్ 2024, శనివారం జరుపుకోనున్నారు. ఈ పండుగను ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని మధుర, బృందావన్, నందగావ్, గోకుల్, బర్సానాలలో జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడు స్వయంగా గోవర్ధన్ పూజ ప్రాముఖ్యతను వివరించాడు. దేవేంద్రుడి అహంకారాన్ని కృష్ణుడు తొలగించిన రోజుని గోవర్ధన పూజ గా జరుపుకుంటారు.

బృందావనం వెళ్లి గోవర్ధన పూజ చేయలేని వారు ఇంట్లో ఆవుపేడను ముద్దగా పెట్టి గోవర్ధన గిరిగా భావించి పూజిస్తారు. కార్తిక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యం లభిస్తుందని నమ్మకం. కార్తిక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల మూడు రోజులు గోపూజ చేస్తే ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యమున విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. క్యాలెండర్‌ ప్రకారం గోవర్ధన పండుగ ఈ రోజు అంటే నవంబర్ 2 న జరుపుకొనున్నారు.

గోవర్ధన్ పూజ రోజున ఆవు పేడతో కృష్ణుడు, గోవర్ధన గిరి విగ్రహాన్ని తయారు చేస్తారు. ఆ విగ్రహాన్ని ఆచారబద్ధంగా పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో గోవర్ధన పూజ కోసం సిద్ధమవుతున్నట్లయితే, ఈ రోజు గోవర్ధన్ పూజకు సంబంధించిన ప్రతి విషయం గురించి తెలుసుకుందాం. గోవర్ధన్ పూజకు శుభ సమయం ఏమిటి? ఎలా పూజించాలి, గోవర్ధన పూజలో ఏయే వస్తువులు అవసరం.. గోవర్ధన పూజ సమయంలో ఏమి చేయకూడదు అనే విషయాలను తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

గోవర్ధన పూజకు అనుకూలమైన సమయం ఏది?

దృక పంచాంగం ప్రకారం కార్తీక మాసం శుక్ల పక్షం పాడ్యమి తిధి నవంబర్ 1వ తేదీన సాయంత్రం 6:16 నుండి ప్రారంభమై ఈరోజు అంటే నవంబర్ 2వ తేదీ రాత్రి 8:21 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం నవంబర్ 2న గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు.

గోవర్ధన పూజ ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంటుంది?

నవంబర్ 2వ తేదీ ఉదయం 6:34 నుండి 8:46 వరకు గోవర్ధన్ పూజ యొక్క శుభ సమయం ఉంటుంది. అంతేకాదు గోవర్ధన పూజకు రెండవ శుభ సమయం నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 5:34 వరకు ఉంటుంది.

గోవర్ధన పూజ సామగ్రి జాబితా

గోవర్ధన పూజ కోసం తాళి, కుంకుమ, అక్షతలు, ధూప దీపం, కలశం, కుంకుమ, నైవేద్యం, స్వీట్లు, గంగాజలం, తమలపాకులు, పువ్వులు, పెరుగు, తేనె, పూల మాల, ఖీర్, ఆవనూనె దీపం, ఆవు పేడ, గోవర్ధన పర్వతం ఫోటో , శ్రీ కృష్ణుని విగ్రహం లేదా చిత్రం, గోవర్ధన్ పూజ కథ పుస్తకం.

గోవర్ధన పూజ ఎలా చేయాలంటే

  1. గోవర్ధన పూజ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, స్నానం చేసి, శ్రీ కృష్ణుడిని పూజించండి.
  2. దీని తరువాత ఇంటి ప్రాంగణంలో ఆవు పేడతో గోవర్ధన పర్వతాన్ని, శ్రీ కృష్ణుని విగ్రహాలను తయారు చేయండి.
  3. గోవర్ధన గిరితో పాటు ఆవు, దూడ విగ్రహాలను కూడా తయారు చేయవచ్చు.
  4. అప్పుడు గోవర్ధన గిరి, శ్రీ కృష్ణ విగ్రహాలను పుష్పాలతో అలంకరించండి.
  5. దీని తరువాత గోవర్ధన గిరికు పసుపు, కుంకుమ, అక్షతలు, చందనాలను శుభ సమయంలో అలంకరించండి
  6. కుటుంబ సమేతంగా కన్నయ్య కీర్తనలు పాడండి.
  7. తర్వాత పాలు, తాంబూలం, వివిధ ఆహారాలను నైవేద్యంగా సమర్పించండి
  8. కుటుంబ సమేతంగా నీళ్లలో పాలు కలిపి గోవర్ధన్ పర్వతానికి 7 సార్లు లేదా 11 సార్లు ప్రదక్షిణ చేయండి.
  9. పరిక్రమ తరువాత నెయ్యి దీపం వెలిగించి స్వామికి హారతి ఇవ్వండి
  10. అప్పుడు కన్నయ్యను కీర్తిస్తూ ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి.

భగవాన్ గోవర్ధన్‌ పర్వతానికి, కన్నయ్యకు సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా అందరికీ పంచండి.

గోవర్ధన్ పూజ రోజున ఏమి చేయాలంటే

  1. గోవర్ధన పూజ రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి.
  2. సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి.
  3. సాత్విక ఆహారం తీసుకోవాలి.
  4. శ్రీకృష్ణుని నామాలను జపించాలి.
  5. గోవర్ధన పర్వతానికి ప్రత్యేక పూజలు చేయాలి.
  6. శక్తి కొలదీ పేదలకు దానం చేయాలి.
  7. శ్రీకృష్ణునికి 56 నైవేద్యాలు సమర్పించాలి.
  8. ఈ రోజున గోవులను పూజించడం శ్రేయస్కరం.

గోవర్ధన పూజ రోజున ఏమి చేయకూడదంటే

  1. గోవర్ధన పూజ రోజున ఎవరితోనూ వాదించకండి.
  2. ఈ రోజున ఎవరినీ దుర్భాషలాడకండి.
  3. ఈ రోజు తామసిక ఆహారాన్ని తీసుకోవద్దు.
  4. పెద్దలను, స్త్రీలను అవమానించవద్దు.
  5. గోవర్ధన పూజ రోజున ఇంటిని మురికిగా ఉంచవద్దు.
  6. గోవర్ధన పూజ రోజున ఆవును ఇబ్బంది పెట్టవద్దు.

గోవర్ధన్ పూజ సమయంలో చదవాల్సిన మంత్రం ఏమిటి?

गोवर्धन धराधार गोकुल त्राणकारक।

विष्णुबाहु कृतोच्छ्राय गवां कोटिप्रभो भव।। ।।

.గోవర్ధన ధరాధర గోకుల త్రాణకారక్|

విష్ణుబాహు కృతోచ్ఛ్రాయ గవాం కోటిప్రభో భవ||

అన్నకూట్ ఎందుకు జరుపుకుంటారు?

గోవర్ధన పూజ రోజున అన్నకూట్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున వివిధ రకాల ఆహార పదార్థాలను శ్రీకృష్ణుడికి భోగ్‌గా సమర్పిస్తారు. గోవర్ధన పూజ రోజున శ్రీకృష్ణుడికి 56 నైవేద్యాలు సమర్పించే సంప్రదాయం కూడా ఉంది.

గోవర్ధన పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

గోవర్ధన పూజ చేయడం వల్ల మనిషి జీవితంలో సంపద, సంతానం, గో సంపద పెరుగుతుంది. అలాగే వ్యక్తి అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందుతాడు. గోవర్ధన పూజ చేసే వ్యక్తి శ్రీకృష్ణుని శాశ్వతమైన అనుగ్రహాన్ని పొందుతాడు.

గోవర్ధన పూజను అన్నకూట్ అని ఎందుకు అంటారు?

గోవర్ధన పూజను చాలా చోట్ల అన్నకూట్ పూజ అని కూడా అంటారు. ఈ రోజున గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలతో చేసిన ఆహారాన్ని, శెనగపిండితో చేసిన కూర, ఆకు కూరలను ఆహారంగా వండి శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెడతారు.

గోవర్ధన పూజ ఎందుకు చేస్తారు?

గోవర్ధన పూజ రోజున గోవర్ధన పర్వతం, ఆవు , శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఈ పూజ ద్వారా సహజ వనరులకు గౌరవం ఇవ్వడం తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ఇంద్రుడిని ఓడించినందుకు గుర్తుగా గోవర్ధన పూజ జరుపుకుంటారు. గోవర్ధన పూజ ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా అందరికీ చెప్పాడని చెబుతారు.

గోవర్ధన పూజ రోజు ఆవుకి ఏమి తినిపించాలి?

ఈ రోజున గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారు. ఈ రోజున ఆవులకు, ఎద్దులకు స్నానం చేయించి రంగులు వేసి వాటి మెడలో కొత్త తాడును కట్టారు. గోవర్ధన పూజ రోజున ఆవులకు, ఎద్దులకు బెల్లం, అన్నం కలిపి తినిపించాలి. అలాగే గోవర్ధన పూజ రోజున గోవులకు గడ్డిని ఆహారం ఇవ్వడం శుభప్రదమని నమ్మకం.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!