Beauty Survey: అందమైన మహిళలకు ఈ కంట్రీ కేరాఫ్! వారి ఆకర్షణ వెనుక ఇదే అసలు కారణం..
ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు ఏ దేశంలో ఉన్నారో తెలుసుకోవడానికి ఒక యూరోపియన్ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు మిమల్ని ఆశ్చర్యపరుస్తాయి. చర్మం, కళ్ల రంగు మాత్రమే కాదు, వారి స్వభావం, నిశ్శబ్దం లాంటి అనేక అంశాల ప్రాతిపదికన ఈ జాబితా తయారు చేసారు. యుద్ధం కారణంగా దెబ్బతిన్న ఒక దేశానికి చెందిన మహిళలు ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. మరి, ఆ దేశం ఏది? ఆ సర్వే వెల్లడి చేసిన ఇతర ఆసక్తికరమైన విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలో అత్యంత అందమైన మహిళలు ఏ దేశంలో ఉన్నారో తెలుసుకోవడానికి ఒక యూరోపియన్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు ఆసక్తికరమైన అంశాల వెల్లడి చేసాయి.
ఈ అధ్యయనం ప్రకారం, ఆకర్షణీయమైన మహిళలు ఎక్కువగా ఉన్న దేశం ఉక్రెయిన్. అవును, యుద్ధంతో దెబ్బతిన్నప్పటికీ, ఉక్రేనియన్ మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా ఉన్నారు.
పరిశోధకులు మహిళల చర్మం రంగు, కళ్ళ రంగుతో సహా అనేక విషయాలను పరిశీలించారు. సర్వే చేసిన మహిళలు సాధారణంగా నిశ్శబ్దంగా ఉంటారనే విషయంపై ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ దేశంలోని యువతితో ఏ పురుషుడైనా సులభంగా డేటింగ్ చేయగలడు. ఈ మహిళల నుంచి మోసం చేసే అవకాశాలు చాలా తక్కువని కూడా వారు చెబుతున్నారు.
అత్యంత అందమైన మహిళల జాబితాలో స్వీడన్ తర్వాత ఉక్రెయిన్ స్థానం సంపాదించుకోగలిగింది. ఈ జాబితాలో ఆ తర్వాత పోలాండ్, నార్వే, బెలారస్, టర్కీ, రష్యా స్థానాలు దక్కించుకోగలిగాయి. పశ్చిమ, మధ్య ఐరోపాలో ఫ్రాన్స్, జర్మనీ అగ్రస్థానంలో నిలిచాయి.
ఇజ్రాయెల్ మహిళలు – సైనిక శిక్షణ:
ఈ అధ్యయనం ఇజ్రాయెల్ మహిళల గురించి ఒక కీలకమైన విషయాన్ వెల్లడి చేసింది. ఇజ్రాయెల్ మహిళలు అందంగా ఉన్నప్పటికీ, వారు అత్యంత హింసాత్మక మహిళలు అనే బిరుదు పొందారు. ప్రపంచంలోని ఏకైక యూదు దేశమైన ఇజ్రాయెల్ లో పౌరులు సైనిక శిక్షణ పొందడం తప్పనిసరి. ఆ దేశంలో మహిళలు రెండేళ్లపాటు సైన్యంలో సేవ చేయాలి. ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఇజ్రాయెల్ మహిళలు పురుషులతో భుజం భుజం కలిపి నిలబడతారు.




