AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple: నెల రోజుల పాటు ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే ఏమవుతుందో తెలుసా..?

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటారు. ఆపిల్ పండులో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, బరువును నియంత్రిస్తాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి. మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 30 రోజుల పాటు ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే ఏమవుతుందో తెలసా..

Apple: నెల రోజుల పాటు ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే ఏమవుతుందో తెలుసా..?
ముఖ్యంగా ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో యాపిల్ తింటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది.
Krishna S
|

Updated on: Oct 01, 2025 | 1:24 PM

Share

మనలో చాలా మంది టీ, కాఫీ లేదా గ్రీన్ టీతో తమ రోజును ప్రారంభిస్తారు. కానీ, ఈ అలవాట్లను పక్కనపెట్టి ఖాళీ కడుపుతో ఒక ఆపిల్ తినడం వల్ల మీ మొత్తం జీవనశైలిలో చాలా సానుకూల మార్పులు వస్తాయని మీకు తెలుసా..? రోజుకు ఒక ఆపిల్ తినండి.. డాక్టర్ దూరంగా ఉండండి అనే మాట మనకు తెలిసిందే. ఆపిల్స్‌లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందుకే చాలా మంది వైద్యులు ఉదయం పూట ఆపిల్ తినమని సలహా ఇస్తారు.

30 రోజుల్లో ఆపిల్ మ్యాజిక్

ఉదయం ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం వల్ల మీ శరీరంపై, మనస్సుపై ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో చూద్దాం:

మెరుగైన జీర్ణక్రియ – శక్తి

ఆపిల్స్‌లో ఉండే ఫైబర్ ఉదయం మీ జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఇది కడుపును శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆపిల్‌లోని సహజ చక్కెర, ఫైబర్, తక్షణ శక్తిని అందిస్తాయి. చాలా మంది ఒక నెల పాటు రోజూ ఉదయం ఆపిల్ తిన్న తర్వాత తేలికగా, శక్తివంతంగా ఉన్నామని చెబుతున్నారు. అంతేకాకుండా మీరు వ్యాయామం చేస్తుంటే లేదా బరువు తగ్గాలనుకుంటే, ఆపిల్ మంచి ఎంపిక. ఇది ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా భోజనంలో మీరు సమతుల్యతను పాటించగలుగుతారు.

మెరుగైన మానసిక స్థితి

ఆపిల్స్‌ రుచి చాలా బాగుంటుంది. వాటిని తిన్న తర్వాత మీ మానసిక స్థితి ఫ్రెష్‌గా మారుతుంది. ఆరోగ్యకరమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడం వల్ల రోజంతా మీరు ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు.

అందం, ఆరోగ్యం మీ సొంతం

ప్రతిరోజూ ఉదయం ఆపిల్ తినడం వల్ల మీ కడుపు, శక్తి స్థాయిలకు మాత్రమే కాదు.. మీ అందానికి కూడా మేలు జరుగుతుంది. దీనిలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మీ చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి.ఒక నెల పాటు ఆపిల్స్ తిన్నవారు వారి చర్మం మరింత తాజాగా, ప్రకాశవంతంగా మారిందని, వారి జుట్టు కూడా బలంగా, మెరిసేలా మారిందని చెబుతారు. ఆపిల్స్ మీ రోజువారీ దినచర్యకు ఒక సూపర్ హెల్తీ ఎంపిక. కాబట్టి నేటి నుంచే ఉదయం ఒక ఆపిల్‌ను మీ అల్పాహారంలో భాగం చేసుకోండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.