Tollywood: లైగర్ ఫ్లాప్ తర్వాత ఆయన ఫోన్ చేసి అన్న మాటకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి..
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇప్పుడంటే కెరీర్‌లో ఒడిదొడుగులు ఎదుర్కొంటున్నారు కానీ ఒకప్పుడు ఆయన డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు. హీరోలు సైతం పూరితో ఒక్క సినిమా చేస్తే చాలు.. మాస్ ఫాలోయింగ్ పెరుగుతుంది అనుకునేవారు ...

సినీ పరిశ్రమలో విజయం వచ్చినప్పుడు అభినందించే వారు చాలా మంది ఉంటారు. కానీ ఓటమి ఎదురైనప్పుడు అండగా నిలిచే వారు అరుదు. అండగా నిలవడం పక్కనబెట్టండి.. కనీసం పలకరించేవారు కూడా ఉండరు. దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక ఫ్లాప్ సినిమా తర్వాత.. జరిగిన ఓ ఎమోషనల్ మూమెంట్ గురించి పంచుకున్నారు. తన చిత్రం పరాజయం పాలైన వారం రోజులకు, రాజమౌళి తండ్రి.. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారి నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. ఆయన పూరిని నాకో సాయం చేస్తారా అని అడిగాడు. ఇది పూరిని ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే సాధారణంగా విజయేంద్ర ప్రసాద్ తనకు ఫోన్ చేయరు. రాజమౌళి తండ్రి అయిన ఆయన తనకు ఏం సహాయం చేయగలను అని పూరి ఆలోచించారు. ఆపై విజయేంద్ర ప్రసాద్.. పూరి తదుపరి సినిమా గురించి ఆరా తీశారు. ఇంకా ఏదీ అనుకోలేదని పూరి చెప్పగా, ఆయన ఒక రిక్వెస్ట్ చేశారు. “నువ్వు ఎప్పుడు సినిమా చేసినా, చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా?” అని అడిగారు. పూరి జగన్నాథ్‌కి ఆయన ఉద్దేశ్యం అర్థమైంది. “మీలాంటి ప్రతిభావంతులైన దర్శకులు చిన్న చిన్న తప్పుల వల్ల విఫలమవడాన్ని నేను చూడలేను. సినిమా తీసే ముందు ఆ చిన్న తప్పులు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అవకాశం ఉంటే నేను సలహాలు ఇస్తాను” అని విజయేంద్ర ప్రసాద్ అన్నాట. ఆ మాటలు విన్న పూరి జగన్నాథ్ ఎమెషనల్ అయ్యారట.
స్టార్ రైటర్ అయినటువంటి విజయేంద్ర ప్రసాద్.. పూరి తన ఫేవరెట్ డైరెక్టర్ అని పలు సందర్భాల్లో చెప్పారు. అంతేకాదు ఏకంగా పూరి జగన్నాథ్ ఫోటోను తన ఫోన్ స్కీన్‌పై పెట్టుకున్నారు. అంత పెద్ద రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్.. పూరికి ఫ్యాన్ అవ్వడం.. ఆయనకు ఇలా నైతిక మద్దతు ఇవ్వడం చాలా గొప్ప విషయం.
Also Read: అభిమానులను మోసం చేశావ్ ఉదయ్ కిరణ్.. ఫీనిక్స్ ఫక్షిలా లేచి వస్తానని చెప్పి..
