Actor Balaji: ఆ హీరోయిన్ నా సొంత చెల్లెలు.. మా బావ ఫేమస్ విలన్.. నటుడు బాలాజీ..
బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రేపుల బాలాజీ. సినిమాలు, సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన వయసు 66 సంవత్సరాలు. ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "నవ్వు అనేది ఒక శక్తి మాత్ర" అని, సంతోషంగా ఉండడమే ఆరోగ్యానికి ప్రధానమని బాలాజీ పేర్కొన్నారు.

నటుడు బాలాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 66 ఏళ్ల వయసులో కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఇటీవల తన డైట్ సీక్రెట్ రివీల్ చేశారు. తన దినచర్య ఉదయం 3:30 నుండి 4 గంటలకు ప్రారంభమవుతుందని అన్నారు. రన్నింగ్, జిమ్, యోగా, ప్రాణాయామం వంటివి క్రమం తప్పకుండా చేస్తానని.. చలికాలంలో కూడా చన్నీటి స్నానాలు చేయడం, కింద నేలపై పడుకోవడం ఆయన అలవాట్లని చెప్పుకొచ్చారు. రాగి సంగటిని అంబలి రూపంలో తీసుకుంటానని.. నెల్లూరులో చదువుకునే రోజుల్లోనే ఈ అలవాటు చేసుకున్నట్లు తెలిపారు. నాన్-వెజ్ ఆహారాన్ని రెండు సంవత్సరాల క్రితం మానేసినట్లు తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
అలాగే టాలీవుడ్ నటి రోహిణి తన అక్క కాదని, ఆమె తన సొంత చెల్లెలని స్పష్టం చేశారు. రోహిణి అలా మొదలైంది, బాహుబలి చిత్రాలలో ప్రభాస్ తల్లిగా నటించారని, దివంగత నటుడు రఘువరన్ భార్య అని తెలిపారు. బాలాజీ తండ్రి కూడా నటుడే అని, విఠలాచార్య గారి కోటలో పాగా చిత్రంలో రామకృష్ణ గారితో పాటు సెకండ్ హీరోగా చేశారని వెల్లడించారు. రామానాయుడు గారి బంధువుల ద్వారా తాను సినిమా పరిశ్రమకు పరిచయమయ్యానని బాలాజీ తెలిపారు. దర్శకుడు దాసరి నారాయణరావు గారి ఎమ్మెల్యే ఏడుకొండలు చిత్రంలో సెకండ్ హీరోగా చేశారు.
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి, అఖిల భారత స్థాయి కళాశాల పోటీల్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుండే నటన పట్ల ఉన్న ఆసక్తిని పంచుకున్నారు. మొదట్లో తండ్రి వ్యతిరేకించినా, తర్వాత ప్రోత్సహించారని చెప్పారు. తన “తేనె కళ్ళు” (హనీ ఐస్) తన కెరీర్‌కు పెద్ద ఆస్తి అని ఆయన నమ్ముతారు.

Balaji, Rohini
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
