Diabetes: స్వీట్ పొటాటో తింటే ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..! మరీ.. షుగర్ ఉన్నవాళ్లు తినొచ్చా..?
చిలగడదుంప ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన బహుమతి. దీని తీపి రుచి, దాని పోషకాలు శరీరానికి అమృతం వంటిది అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు.. మీ శరీరాన్ని ఉక్కులా మార్చగల శక్తిని ప్రకృతి ఈ పండుకు ఇచ్చింది. చిలగడదుంప శీతాకాలపు పంట. ఇది అక్టోబర్ నుండి ఫిబ్రవరి-మార్చి వరకు విరివిగా లభిస్తుంది. ప్రజలు దీనిని తరచుగా చిరుతిండిగా, అల్పాహారంగా తీసుకుంటారు. అయితే, షుగర్ ఉన్నవారు చిలగడ దుంప తింటే ఏమౌతుందో తెలుసా.. ?

చిలగడదుంప ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన బహుమతి. దీని తీపి రుచి, దాని పోషకాలు శరీరానికి అమృతం వంటిది అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు.. మీ శరీరాన్ని ఉక్కులా మార్చగల శక్తిని ప్రకృతి ఈ పండుకు ఇచ్చింది. చిలగడదుంప శీతాకాలపు పంట. ఇది అక్టోబర్ నుండి ఫిబ్రవరి-మార్చి వరకు విరివిగా లభిస్తుంది. ప్రజలు దీనిని తరచుగా చిరుతిండిగా, అల్పాహారంగా తీసుకుంటారు. చిలగడదుంప రుచిలో రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనిని తిన్న తర్వాత త్వరగా ఆకలిగా అనిపించదు. బరువును నియంత్రణలో ఉంచుతుంది. చిలగడదుంప నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి, దాని సరైన ఉపయోగం తెలుసుకోవడం కూడా ముఖ్యం.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం..కొంతమంది చిలగడదుంపలను ఉడకబెట్టడం లేదా కాల్చి తింటారు. ఈ పండును పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ తినవచ్చు. ఈ మృదువైన దుంప తినడానికి సులభం. విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఈ చిలగడదుంపల్లో విటమిన్ B-6, మెగ్నీషియం, విటమిన్ సీతోపాటు, అధిక ఫైబర్, తక్కువ కొవ్వు , కేలరీలతో నిండి ఉంటుంది. చిలగడదుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇందులోని పీచు రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది.
చిలగడదుంపలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. చిలగడదుంపలో కరిగే, కరగని లాంటి రెండు రకాల ఫైబర్ ఉంటుంది. మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ ఏ రకమైన ఫైబర్ ను జీర్ణం చెయ్యదు. అందువల్ల, ఫైబర్ మీ జీర్ణవ్యవస్థలోనే ఉంటుంది. ఇది అనేక రకాల గట్ సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చిలగడదుంపలు మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉన్నాయి. చిలకడదుంపలు డైటరీ ఫైబర్ ను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకాన్ని సమర్థవంతంగా నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెస్ట్ ఫుడ్‌గా కూడా స్వీట్ పోటాలో తీసుకోవచ్చు.
ఇందులో ఉండే ఫైబ్రినోజేన్ కూడా రక్త గడ్డకట్ట కుండా సహాయపడుతుంది. అలాగే ఈ దుంపలలోని అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్‌ను క్రమబద్ధీకరిస్తుంది. తక్కువ మోతాదులో షుగర్ ఉన్నవారికి మంచిదని చెబుతున్నారు. ఇందులో ఉండే మెగ్నీషియం ఆరోగ్యకరమైన ధమనులకు, గుండె కండరాలకు చాలా మంచిది. రక్తపోటును నియంత్రిస్తుంది. చిలగడదుంపలు వివిధ యాంటీఆక్సిడెంట్లను మన శరీరానికి అందిస్తాయి, ఇవి కొన్ని రకాల కాన్సర్ల నుండి మనలని రక్షించడంలో సాయపడతాయి. చిలకడదుంపలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చిలగడదుంపలోని ఆంథోసైనిన్లు మంటను తగ్గించి ఫ్రీ రాడికల్ డామేజ్ ను తగ్గిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








