AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card Update: ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు ఫొటోను మార్చుకోవచ్చా..?

ఆధార్ కార్డు అనేద దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ అవసరమైన గుర్తింపు ధృవీకరణ పత్రం. ఇది లేనిది మీరు ఏ ప్రభుత్వ సేవ పొందలేరు. అలాగే సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా లేదా ఇతర పనలకు ఇది అవసరమే. అందుకే డీటైల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి.

Aadhaar Card Update: ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు ఫొటోను మార్చుకోవచ్చా..?
Aadhar Card Update
Venkatrao Lella
|

Updated on: Jan 16, 2026 | 5:59 PM

Share

ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు చిన్న వయస్సులో దిగిన ఫొటో సాధారణంగా ఉంటుంది. పెద్దయ్యే కొద్ది శరీరంలో వచ్చే మార్పుల వల్ల మనరూపం పూర్తిగా మారిపోతూ ఉంటుంది. దీని వల్ల వయస్సు పెరిగే కొద్ది ఆధార్ కార్డులోని ఫొటో చూసి మిమ్మల్ని గుర్తు పట్టడం చాలా కష్టతరంగా ఉంటుంది. దీంతో ఆధార్ కార్డులోని ఫొటోను మార్చుకోవడం వల్ల ధృవీకరణ సమయంలో మిమ్మల్ని గుర్తు పట్టడం సులువుగా ఉంటుంది. దీని వల్ల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా అవుతుంది. అందుకే ఆధార్ కార్డులోని ఫొటోను మార్చుకోవడం చాలా అవసరం. దీని వల్ల చాలా మీకు చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఆధార్ కార్డులోని ఫొటోను ఎలా మార్చుకోవాలి? ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం

ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చా..?

ప్రస్తుతానికి అయితే ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డులోని మన ఫొటోను మార్చుకునే అవకాశం అందుబాటులో లేదు. ఫొటోను మార్చుకోవాలంటే ఆధార్ కార్డ్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు లేదా కేంద్ర ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఫొటో అప్డేట్ ఫారం నింపడం ద్వారా మీరు ఫొటోను అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ బయోమెట్రిక్ వివరాలను అందించాల్సి ఉంటుంది. అనంతరం మీ ఫొటోను అప్డేట్ చేసుకోవచ్చు.

ఇలా చేయండి

-www.uidai.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి -ఆధార్ అప్డేట్ ఫారంను క్లిక్‌ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి -వివరాలు పూర్తి చేసి మీ సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి ఫారంను అందించండి. -రూ.100 ఫీజు చెల్లించండి -మీ బయోమెట్రిక్ వివరాలు చెక్ చేసి మీ ఫొటోను తీస్తారు -ఫొటో తీశాక ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి -ఫొటో తీసాక అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది -రిక్వెస్ట్ నెంబర్ ఆధారంగా మీ ఫొటో అప్డేట్ అయిందో లేదో తెలుసుకోండి -ఫొటో అప్డేట్ అయ్యాక కొత్త ఆధార్ కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టుకోండి -మీ ఇంటికి పోస్ట్ ద్వారా కొత్త ఆధార్ కార్డు వస్తుంది.

Follow Us
హోటళ్లల్లో జరిగే ఫంక్షన్లకు అతిథులకు స్వాగతం పలికా..
హోటళ్లల్లో జరిగే ఫంక్షన్లకు అతిథులకు స్వాగతం పలికా..
జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో..
జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో..
చియా సీడ్స్ తింటున్నారా? రెట్టింపు లాభాల కోసం ఎలా తీసుకోవాలంటే
చియా సీడ్స్ తింటున్నారా? రెట్టింపు లాభాల కోసం ఎలా తీసుకోవాలంటే
ఆ లిస్ట్‌లో హర్మన్‌ప్రీత్, షఫాలీలను వెనక్కి నెట్టిన మంధాన
ఆ లిస్ట్‌లో హర్మన్‌ప్రీత్, షఫాలీలను వెనక్కి నెట్టిన మంధాన
తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కూడా ఉంటే వెంటనే
తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కూడా ఉంటే వెంటనే
రోడ్డు మీద పరుగులు తీస్తున్న ఆటో.. లోపల ఏముందో చూసి పోలీసులకే..
రోడ్డు మీద పరుగులు తీస్తున్న ఆటో.. లోపల ఏముందో చూసి పోలీసులకే..
ఆలుగడ్డలు తింటే బద్ధకం పెరుగుతుందా..? సద్గురు కామెంట్స్ వెనుక..
ఆలుగడ్డలు తింటే బద్ధకం పెరుగుతుందా..? సద్గురు కామెంట్స్ వెనుక..
సరికొత్త చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్!
సరికొత్త చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్!
దుస్థానంలో గురువు.. ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త
దుస్థానంలో గురువు.. ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త
తొలి బంతికే సిక్స్.. ప్రపంచ రికార్డు సృష్టించిన షఫాలీ వర్మ!
తొలి బంతికే సిక్స్.. ప్రపంచ రికార్డు సృష్టించిన షఫాలీ వర్మ!