Vijay Sethupathi: దుబాయ్‌లో అకౌంటెంట్ జాబ్.. ఇప్పుడు కోట్లకు అధిపతి.. విజయ్ సేతుపతి ఆస్తులు ఎంతంటే..
సినీరంగంలో హీరోగా, నటుడిగా, విలన్ గా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులు చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో విజయ్ సేతుపతి ఒకరు. సైడ్ రోల్స్ చేసి హీరోగా పాన్ ఇండియా లెవల్లో పాపులర్ అయ్యారు. ఈరోజు మక్కల్ సెల్వన్ పుట్టిన రోజు . ఈ సందర్భంగా విజయ్ సేతుపతి ఆస్తులు ఎంతో తెలుసా.. ?

కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి ఫీల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కుర్రాడు.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. దుబాయ్ లో అకౌంటెంట్ గా పనిచేసిన విజయ్ సేతుపతి.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టారు. సైడ్ క్యారెక్టర్స్ చేసి ఆ తర్వాత హీరోగా మెప్పించారు. హీరోగా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే విలన్ పాత్రలతో అదరగొట్టారు. జనవరి 16న విజయ్ సేతుపతి పుట్టినరోజు. ప్రస్తుతం ఆయన వయసు 48 సంవత్సరాలు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
చెన్నైకి చెందిన విజయ్ సేతుపతి.. 16 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టాడు 1994లోనే నమ్మవర్ సినిమాకు ఆడిషన్ ఇచ్చాడు . కానీ హైట్ తక్కువ ఉందని మేకర్స్ రిజెక్ట్ చేశాడు. కొన్నాళ్లు దుబాయ్ లో అకౌంటెంట్ గా పనిచేశాడు. నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకున్నాడు. మొదట్లో సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించారు. ఆ తర్వాత 2010లో వచ్చిన తెన్మెర్కు పరువకాట్రు సినిమాతో హీరోగా బ్రేక్ వచ్చింది. ఈ మూవీ తర్వాత వెనుదిరిగి చూడలేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వెనుదిరిగి చూడలేదు.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
తెలుగులో ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఇందులో రాయనం పాత్రలో నట విశ్వరూపం చూపించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీలో కీలకపాత్ర పోషించారు. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంలో విలన్ పాత్రలో నటించారు. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
