Watch Marketing: గడియారాలు అమ్మేందుకు ఇప్పటికీ వాడుతున్న బిజినెస్ ట్రిక్ ఇది.. మీలో 99 శాతం మందికి ఇది తెలిసుండదు..
ఒక్కో వస్తువును మార్కెటింగ్ చేసేందుకు ఒక్కో బిజినెస్ ట్రిక్ ను ఉపయోగిస్తుంటారు. అందుకు కస్టమర్ల సైకాలజీ దగ్గరి నుంచి కొన్ని విశ్వాసాల వరకు ఎన్నింటినో వాడేస్తుంటారు. అలాంటిదే ఇది కూడా. మనలో చాలా మంది గమనించినా పెద్దగా పట్టించుకుని ఉండం. కొత్త గడియారాలు కొనేందుకు వెళ్లినప్పుడు అందులో టైమెప్పుడూ 10: 10 సమయాన్నే చూపుతుంటుంది. ఇలా టైమ్ సెట్ చేయడం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ కారణం ఉంది.

గూగుల్‌లో గడియారాల చిత్రాలు వెతికినా లేదా వాటిని కొనేందుకు వాచ్ షాపులకు వెళ్లినా మీకు ఒక విషయం కామన్ గా కనిపిస్తుంటుంది. అన్ని గడియారాల్లోనూ సమయం 10 గంటల 10 నిమిషాలుగా చూపిస్తుంది. దీన్ని మీరెప్పుడైనా గమనించారా?.. ఇది ఇలాగే ఎందుకుక ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ దీని వెనక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. అదేంటో మీరూ తెలుసుకోండి. గడియారాలు ఎప్పుడూ 10:10 సమయంతోనే ఉండాలని రూల్ ఏమీ లేదు. గతంలో కొన్ని కంపెనీలు 8 గంటల 20 నిమిషాలకు కూడా సమయం సెట్ చేసేవి. కానీ ఇప్పుడు 10:10 ఒక ట్రెండ్‌గా మారిపోయింది. దీని వెనక కొన్ని శాస్త్రీయమైన ఆలోచనాత్మక కారణాలు ఉన్నాయి.
కొన్ని పుకార్లు
ఈ 10:10 సమయం గురించి చాలా కథలు వినిపిస్తాయి. కొందరు అబ్రహం లింకన్ ఈ సమయంలో చనిపోయాడని అంటారు, కానీ అతను నిజానికి 10:15కి మరణించాడు. మరికొందరు హిరోషిమా, నాగసాకిలో బాంబు దాడులు ఈ సమయంలో జరిగాయని చెబుతారు, కానీ అదీ నిజం కాదని తేలింది. ఇవన్నీ కేవలం పుకార్లుగానే మిగిలాయి.
అసలు కారణం ఏమిటి?
నిజానికి 10:10 సమయంలో గడియారం సూదులు ఒక ‘V’ ఆకారంలో కనిపిస్తాయి. గంటల సూది 10 వద్ద, నిమిషాల సూది 2 వద్ద ఉంటాయి. ఈ ‘V’ అంటే విజయం (విక్టరీ) సంకేతంగా చూస్తారు. ఈ ఆకారం సంతోషాన్ని, విజయ భావనను తెప్పిస్తుందని కంపెనీలు భావిస్తాయి. అందుకే ఈ సమయాన్ని ఎంచుకుంటాయి.
బ్రాండ్ పేరు కనిపించడం
ఇంకో ముఖ్యమైన కారణం ఉంది. 10:10 సమయంలో సూదులు గడియారం మధ్యలో ఉండే బ్రాండ్ పేరును దాచవు. సాధారణంగా గడియారంలో కంపెనీ పేరు 12 వద్ద ఉంటుంది. ఈ సమయంలో చూస్తే, ముందు ఆ బ్రాండ్ పేరు కంటికి పడుతుంది. ఇది కొనుగోలు చేసేవారి దృష్టిని ఆకర్షించడానికి సహాయపడుతుంది.గడియారాలు 10:10 సమయంతో కనిపించడం వెనక విజయ భావన, అందమైన ఆకారం, బ్రాండ్ స్పష్టత ఉన్నాయి. ఈ చిన్న ఆలోచనతో కంపెనీలు మనల్ని ఆకర్షించి, గడియారాలు కొనేలా చేస్తుంటాయి.
