నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. పదో తరగతితో పోలీస్ జాబ్.. యాభై వేలకు పైగా ఖాళీలు.. అస్సలు మిస్ కాకండి..

SSC Constable GD Recruitment - 2021: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) 2021 పరీక్ష షెడ్యూల్‌ను మార్చి 25న విడుదల చేయనుంది.

  • uppula Raju
  • Publish Date - 4:54 am, Tue, 23 February 21
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. పదో తరగతితో పోలీస్ జాబ్.. యాభై వేలకు పైగా ఖాళీలు.. అస్సలు మిస్ కాకండి..

SSC Constable GD Recruitment – 2021: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) 2021 పరీక్ష షెడ్యూల్‌ను మార్చి 25న విడుదల చేయనుంది. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల నియామకానికి ఎస్‌ఎస్‌ఎస్‌ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. కమిషన్‌ వెల్లడించిన ఎగ్జామ్‌ క్యాలెండర్‌ ప్రకారం మే 10న రిజిస్ట్రేషన్‌ ప్రారంభం. ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 25వ వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహణ ఉంటుంది.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ప్రకటించారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్‌ ఇంటలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవర్‌నెస్‌, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లేదా హిందీపై ప్రశ్నలు ఉంటాయి.

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (SSC) ఉద్యోగాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారా..? అయితే అలాంటి వారికి గుడ్‌న్యూస్