స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా..? అయితే అలాంటి వారికి గుడ్‌న్యూస్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా..? అయితే అలాంటి వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు...
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా..? అయితే అలాంటి వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు మైనార్టీ స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగాలను ఎస్సెస్సీ భర్తీ చేయనుంది. ఆయా ఉద్యోగాలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు మైనార్టీ స్టడీ సర్కిల్ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది.
ఆసక్తిగల వారు పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలతో కూడిన వివవరాలు directormsctelangana@gmail.com, వాట్సాప్ నెంబర్ 87900 77816లకు పంపించాలని అధికారులు సూచించారు. అలాగే ఇతర వివరాలకు 040– 23236112 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు. సీహెచ్ ఎస్ ఎల్ ద్వారా భర్తీ చేయనున్న లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, లెవల్-4,5, డాటా ఎంట్రీ ఆపరేటర్-గ్రేడ్ 1 లెవల్-4 పోస్టులకు సంబంధించి శిక్షణ అందించనున్నారు.