AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ వద్దామంటే భయపెడుతున్న రూల్స్.. అంతర్జాతీయ ప్రయాణాలకు కొత్త నిబంధనలు.. ఎన్ఆర్ఐలకు తప్పని ఇబ్బందులు

New Travel rules : కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో మనిషి నాలుగు గోడల మధ్య బందీ అయ్యాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు

భారత్ వద్దామంటే భయపెడుతున్న రూల్స్.. అంతర్జాతీయ ప్రయాణాలకు కొత్త నిబంధనలు.. ఎన్ఆర్ఐలకు తప్పని ఇబ్బందులు
uppula Raju
|

Updated on: Feb 23, 2021 | 12:01 AM

Share

New Travel rules : కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో మనిషి నాలుగు గోడల మధ్య బందీ అయ్యాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. పరాయి దేశం పొమ్మంటుంటే. అటు స్వదేశానికి వెళ్లేందుకు విమానాలు లేక ఎంతో మంది భారతీయులు నలిగిపోయారు. ఎప్పుడూ కలలో కూడా ఊహించని ఎన్నో సంఘటనలు గతేడాది జరిగాయి.అయితే భారత ప్రభుత్వం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక విమానాలు నడిపి లక్షలాది మంది ప్రవాసుల్ని స్వదేశానికి తీసుకొచ్చింది. ఆ తర్వాత విమాన ప్రయాణాల విషయంలోనూ ఆయా దేశాలు దశలవారీగా సడలింపులు ఇవ్వడంతో ఎన్ఆర్ఐలు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఓ పక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నా, టీకాలు అందుబాటులోకి వస్తున్నా ప్రపంచంపై కోవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. నిత్యం ఏదో ఓ మూలన ఆ మహమ్మారి విజృంభిస్తూనే వుంది. వీటికి కొత్తగా మ్యూటేషన్ చెందిన వైరస్‌ అదనం. వివిధ దేశాల్లో కొత్తగా వెలుగులోకి వస్తున్న మార్పు చెందిన కరోనా. ప్రభుత్వాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటికే యూకే సహా పలు దేశాల్లో కఠిన లాక్‌డౌన్‌ అమల్లో వున్న సంగతి తెలిసిందే. మనదేశంలోనూ యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం స్ట్రెయిన్‌లు వెలుగు చూస్తున్నాయి. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వివిధ దేశాల నుంచి మనదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కొత్త గైడ్‌లైన్స్ ఫిబ్రవరి 22 అర్ధరాత్రి 11.59 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వెలువడేవరకు అమల్లో ఉంటాయి. ప్రధానంగా బ్రిటన్, ఐరోపా, మధ్యప్రాచ్యం నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు ఈ ప్రత్యేక మార్గదర్శకాలను అనుసరించాలి.

కొత్త నిబంధనల ప్రకారం పైన వివరించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణం మొదలవడానికి ముందే ఎయిర్‌ సువిధ వెబ్‌సైట్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొవిడ్‌-19 ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ ఫలితం నివేదికను అప్‌లోడ్‌ చేయాలి. ప్రయాణానికి 72 గంటలకు ముందు ఈ పరీక్ష చేసుకొని ఉండాలి. ప్లైట్ ఎక్కే సమయంలో థర్మల్ స్క్రీన్ తర్వాత ఎటువంటి లక్షణం లేనివారిని మాత్రమే అనమతిస్తారు. ప్రయాణికులు అందరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఉండాలి. సముద్ర మార్గాన వచ్చే ప్రయాణికులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. అంతేకాకుండా భారత్‌కు చేరకున్నాక వీరంతా తమ సొంత ఖర్చులతో ఎయిర్‌పోర్టులో కరోనా టెస్ట్ చేయాంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏమైనా లక్షణాలు కనిపిస్తే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి.

ఈ ఆంక్షల నేపథ్యంలో విదేశీయులతో పాటు ప్రవాసులు భారతదేశం రావడానికి పునరాలోచిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌కు రావాలని ప్లాన్ చేసుకుంటున్న వారు వెనకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రయాణ వ్యయం అధికమవ్వడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటం తదితర కారణాల వల్ల ఎన్ఆర్ఐలు స్వదేశానికి రావడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.

Ether Energy : తక్కువ ధరలో మైలేజ్ ఇచ్చే వాహనాలు.. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఏథర్ ఎనర్జీ నూతన బ్రాంచ్‌ల ఏర్పాటు..