Drug Confiscation: మణిపుర్‌లో మాదకద్రవ్యాల పట్టివేత.. ముగ్గురు అరెస్ట్.. సరుకు విలువ తెలిస్తే షాకవుతారు..
Drug Confiscation: మణిపుర్‌లో రూ.14కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 1.4 లక్షల నిషేధిత డబ్ల్యూవై మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Drug Confiscation: మణిపుర్‌లో రూ.14కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 1.4 లక్షల నిషేధిత డబ్ల్యూవై మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మణిపుర్ ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని అంతర్జాతీయ మార్కెట్లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి రూ.14 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతుందనే పక్కా సమాచారంతో కంగ్లాటోంగ్బి-శాంతిపుర్ ప్రాంతానికి సమీపంలో పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ తరలిస్తున్న రెండు ట్రక్కులను అడ్డుకుని.. వాటి నుంచి 1.4 లక్షల నిషేధిత డబ్ల్యూవై మాత్రలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయమై నిందితుల్ని విచారించగా.. అసోం గువహటిలోని ఓ ఏజెంటుకు ఆ డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లు చెప్పారని అధికారులు పేర్కొన్నారు.
AP SEC Orders : మార్చి10ని సెలవుదినంగా ప్రకటించాలి..! కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ఎస్‌ఈసీ