హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో మైనర్ బాలికల కిడ్నాప్.. టాబ్లెట్‌ మింగించి అఘాయిత్యానికి ప్రయత్నం..

Hyderabad Crime : హైదరాబాద్‌ పాతబస్తీలోని మైలార్‌ దేవ్‌ పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే నజ్మా బేగం, మొహమ్మద్‌

  • uppula Raju
  • Publish Date - 12:04 am, Tue, 23 February 21
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో మైనర్ బాలికల కిడ్నాప్.. టాబ్లెట్‌ మింగించి అఘాయిత్యానికి ప్రయత్నం..

Hyderabad Crime : హైదరాబాద్‌ పాతబస్తీలోని మైలార్‌ దేవ్‌ పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే నజ్మా బేగం, మొహమ్మద్‌ సాజిద్ దంపతులకు ముగ్గురు సంతానం. తల్లి ఇంట్లో పనిలో ఉండగా మైనర్లయిన కూతుళ్లిద్దరూ అదృశ్యమయ్యారు. చుట్టుపక్కల వెతికి చూసినా ఫలితం లేకపోయింది. వీళ్లిద్దరినీ ఎత్తుకెళ్లిన ఓ యువకుడు, వారికి బలవంతంగా టాబ్లెట్‌ మింగించి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. పిల్లల అరుపులు విన్న స్థానికుడు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వెంటనే చాంద్రాయణగుట్ట పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కూతుళ్లిద్దరు పోలీసుల దగ్గర క్షేమంగా ఉన్నారని తెలుసుకొన్న తల్లిదండ్రులు పీఎస్‌కి వెళ్లి తమ పిల్లలను తెచ్చుకొన్నారు. స్థానికంగా ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.

భారత్ వద్దామంటే భయపెడుతున్న రూల్స్.. అంతర్జాతీయ ప్రయాణాలకు కొత్త నిబంధనలు.. ఎన్ఆర్ఐలకు తప్పిని ఇబ్బందులు