Petrol Price Today: 12 రోజుల తర్వాత కొద్దిగా ఉపశమనం.. స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ఎంతంటే..

Petrol Price Today: గత 12 రోజులుగా దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ పెరుగుదులకు మంగళవారం

Petrol Price Today: 12  రోజుల తర్వాత కొద్దిగా ఉపశమనం.. స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ఎంతంటే..
Petrol-Price-Today
Follow us

|

Updated on: Feb 23, 2021 | 5:08 AM

Petrol Price Today: గత 12 రోజులుగా దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ పెరుగుదులకు మంగళవారం కాస్త బ్రేక్‌ పడింది. దీంతో జనాలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. దేశ వ్యాప్తంగా మంగళవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.90.58 ఉండగా (సోమవారం రూ.90.58 ), డీజీల్‌ రూ80.97 వద్ద కొనసాగుతోంది. సోమవారం లీటర్‌ డీజిల్‌ రూ.80.97 గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర అత్యధికంగా రూ.97.00గా నమోదుకాగా (సోమవారం రూ.97.00గా) డీజిల్‌ రూ. 88.06 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇక్కడ కూడా ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించింది. సోమవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్‌ గరిష్ట ధరకు చేరుకుంది. భాగ్యనగరంలో నేడు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.18గా ఉండగా (సోమవారం రూ.94.18), డీజిల్‌ రూ.88.31గా (ఆదివారం రూ.88.31) పలికింది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణమైన వరంగల్‌లో మాత్రం స్వల్పంగా పెట్రోల్‌ తగ్గగా, డీజిల్‌ ధర పెరిగింది. ఇక్కడ సోమవారం లీటర్‌ పెట్రోల్‌ రూ.93.76 గా (సోమవారం రూ.93.76) ఉండగా, డీజిల్‌ రూ.87.91 వద్ద (సోమవారం రూ. 87.91) కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ.96.62ఉండగా (సోమవారం రూ.96.48) ఇక్కడ నిన్నటితో పోల్చుకుంటే రూ.14 పైసలు పెరిగింది. ఇక డీజిల్‌ రూ.90.20 వద్ద (సోమవారం రూ.90.10) నిన్నటితో పోల్చుకుంటే రూ.10 పైసలు పెరిగింది. సాగర నగరం విశాఖలో మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ రూ.95.54 గా (సోమవారం రూ.96.16) నమోదు కాగా, నిన్నటితో పోల్చుకుంటే రూ. 52 పైసలు తగ్గింది. డీజిల్‌ రూ.89.17 వద్ద (సోమవారం రూ.89.74) కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.54 పైసలు తగ్గింది.

Ether Energy : తక్కువ ధరలో మైలేజ్ ఇచ్చే వాహనాలు.. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఏథర్ ఎనర్జీ నూతన బ్రాంచ్‌ల ఏర్పాటు..