AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: 5 సెకన్లలో దాగి ఉన్న సంఖ్యను కనిపెట్టగలరా ?

ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ఒకరకమైన ఆట. ఈ ఆటలు సృజనాత్మకతను పెంపొందించేవిగా ఉంటాయి. ఈ ఆటలను ఆడినప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్ గా పని చేస్తుంది. ఈ కారణంగా మానసిక ఆందోళనలో ఉన్న వారు ఈ ఆటలను ఆడితే ఆందోళన తగ్గి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

Optical Illusion: 5 సెకన్లలో దాగి ఉన్న సంఖ్యను కనిపెట్టగలరా ?
Optical Illusion
Prashanthi V
|

Updated on: Jan 19, 2025 | 11:16 AM

Share

Optical Illusion: ప్రస్తుత కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్‌లు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. సహజంగానే మనకు ఫజిల్‌లు లేదా ఛాలెంజ్‌లు ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తాయి. పైగా ఏదైనా నిగూఢమైన పజిల్ ఉంటే దాన్ని తీర్చేదాకా ఆగలేం. తాజాగా ఒక ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందో మీరే చూడండి.

కొన్ని ఫోటోలను చూస్తే తొలిసారి ఒకటి కనిపించినట్లు అనిపిస్తుంది. అయితే, అదే ఫోటోను మరోసారి పరిశీలిస్తే, అది పూర్తిగా భిన్నంగా అనిపిస్తుంది. ఆప్టికల్ ఇల్యూషన్ అంటేనే ఇలా మన కళ్లను మోసగించే చిత్రాలు. ఇవి దృశ్యాల మధ్య దాగి ఉన్న రహస్యాలను కనిపెట్టడంలో సహాయపడుతాయి. ఈ రహస్యాలను గుర్తించగలవారికే మంచి దృష్టి ఉన్నదని చెప్పవచ్చు.

ఇంగ్లీష్ లో ఉన్న అక్షరాలలో దాగి ఉన్న “5” సంఖ్యను గుర్తించండి చూద్దాం. ఈ చిత్రంలోని అన్ని లైన్లలో ఒకే విధంగా అక్షరాలు కనిపిస్తున్నాయి. వీటిలో కనిపించకుండా దాగి ఉన్న సంఖ్యను కనిపెట్టండి. ఆ దాగి ఉన్న సంఖ్యను కనుగొనడమే ఇవాళ మీకు ఇచ్చిన టాస్క్. ఈ పనిని పూర్తి చేయడానికి మీకు కేవలం 5 సేకన్ల టైమ్ మాత్రమే ఉంది.

Whatsapp Image 2025 01 18 At 20.47.41

ఇప్పుడు ఈ ఫొటోను మరోసారి బాగా చూసి సంఖ్యను గుర్తించండి. చాలామంది మొదటిసారి చూస్తే ఈ ఫొటోలో అన్ని ఒకే విధంగా అక్షరాలు కనిపిస్తాయి. కానీ అప్పుడు మీరు మరింత జాగ్రత్తగా చూసినపుడు దాగి ఉన్న సంఖ్యను మీరు చూడొచ్చు. ఇప్పటికి మీరు 5 సెకన్లలో ఈ సంఖ్యను గుర్తిస్తే, మీ కంటి చూపు సాఫీగా, స్పష్టంగా ఉన్నట్లు. కొంతమంది మాత్రం దీనిని గుర్తించలేరు. ఎందుకంటే వారి చూపు సరిగ్గా ఉండకపోవచ్చు. ఇలాంటి పరిక్షలోనే మీకు మీ కంటి చూపు గురించి తెలుస్తుంది.

ఈ పరీక్షలో 5 సెకన్ల టైం మాత్రమే ఉంది. కాబట్టి మీరు త్వరగా కనిపెట్టడానికి చూడండి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ మీకు సరదాగా కూడా ఉంటుంది. 5 సెకన్లలో 5 సంఖ్యను కనుగొనడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

Whatsapp Image 2025 01 18 At 20.47.41 (1)