Nehru: ‘నెహ్రూ గిరిజన భార్య’ ఇకలేరు.. అసలు కథెంటంటే..

1959లో దామోదర నదిపై నిర్మించిన పాంచెట్ డ్యామ్‌, జల విద్యుత్‌ను ప్రారంభించేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ వచ్చారు. నెహ్రూకు స్వాగతం పలికేందుకు దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ అధికారులు కొందరు ఆదివాసీ మహిళలను పిలిచారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యులైన వారు కూడా వీరిలో ఉన్నారు. వీరిలో ఒకరు బుద్ధిని మంఝి ఒకరు. ఆ సమయంలో ఆమె వయసు 15 ఏళ్లు. సంతాలీ తెగకు చెందిన ఈ అమ్మాయితో...

Nehru: 'నెహ్రూ గిరిజన భార్య' ఇకలేరు.. అసలు కథెంటంటే..
Budhni Manjhi
Follow us

|

Updated on: Nov 21, 2023 | 10:40 AM

భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ భార్య గత శుక్రవారం తుది శ్వాస విడిచారు. అదేంటీ.. నెహ్రూ భార్య, కమలా భార్య 1936లోనే మరణించారు కదా.! ఇప్పుడు మళ్లీ భార్య మరణించారు అంటారేంటి అనుకుంటున్నారా.? అయితే దీని వెనకాల పెద్ద చరిత్రే ఉంది. ఈ కథ తెలియాలంటే 64 ఏళ్ల వెనక్కి వెళ్లాల్సిందే.

1959లో దామోదర నదిపై నిర్మించిన పాంచెట్ డ్యామ్‌, జల విద్యుత్‌ను ప్రారంభించేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ వచ్చారు. నెహ్రూకు స్వాగతం పలికేందుకు దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ అధికారులు కొందరు ఆదివాసీ మహిళలను పిలిచారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యులైన వారు కూడా వీరిలో ఉన్నారు. వీరిలో ఒకరు బుద్ధిని మంఝి ఒకరు. ఆ సమయంలో ఆమె వయసు 15 ఏళ్లు. సంతాలీ తెగకు చెందిన ఈ అమ్మాయితో ప్రాజెక్టును ప్రారంభించాలని భావించిన నెహ్రూ.. అందుకోసం బుద్ధిని మంఝిను పిలిపించారు. ఆమెతో బటన్‌ నొక్కించి ప్రాజెక్టు ప్రారంభింపజేశారు.

అనంతరం బుద్ధిని గౌరవంగా నెహ్రూ మెడలో పూలమాల వేశారు. దీంతో నెహ్రూ ప్రతిస్పందిస్తూ.. ఈ మర్యాద దక్కాల్సింది నాకు కాదంటూ, ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చి, ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలుపంచుకున్న మీకే అంటూ తిరిగి ఆ దండను బుద్ధిని మెడలో వేశారు. అనంతరం షేక్‌హ్యాండ్‌ ఇచ్చి అభినందనలు తెలిపారు. ఇదిగో ఇదే.. బుద్ధిని జీవితాన్ని మార్చేసింది. ఊరు పెద్దలు బుద్ధిని నిందించడం మొదలు పెట్టారు. దీనికి కారణం ఆ జాతి ఆచారాల ప్రకారం.. దండలు వేసుకొని చేతులు కలుపుకుంటే వివాహం జరిగినట్లే. వేరే జాతికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నావని, తమ కట్టుబాట్లకు వ్యతిరేకంగా వ్యవహరించావన్న కారణంతో ఆమెను తెగనుంచి వెలివేశారు. దీందో ఒక్కసారిగా బిత్తరపోయిన బుద్ధినికి ఏం చేయాలో అర్థం కాలేదు.

Nehru

అంతలోనే దామోదర్‌ వ్యాలీ కూడా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఏం చేయాలో తెలియక బతుకుతెరువు కోసం బెంగాల్‌లోని పురూలియాకు వలస వెళ్లి అక్కడ జీవనం సాగించడం మొదలు పెట్టింది. ఆ క్రమంలోనే ఆమెకు సుధీర్‌ దత్తా అనే వ్యక్తితో పరిచయం అయింది. అతనితో సహజీవనం చేయడం ప్రారంభించింది. వీరికి ఓ పాప జన్మించింది. ఇక ఏళ్లు గడిచినా ఆ తెగవారు మాత్రం పట్టినపంతం వీడలేదు.

ఇక ఈమె జీవిత గాథను కొన్ని పత్రికలు వెలుగులోకి తీసుకొచ్చాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న రాజీవ్‌ గాంధీ.. ఆమెను తన దగ్గరికి పిలిపించుకున్నారు. ఆమెకు తిరిగి దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌లో ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. అలా మళ్లీ ఆమె ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలోనే బుద్ధిని జీవితాంతం తన కూతురు, అల్లుడితోనే జీవనం సాగించింది. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తికి పూల మాల వేసినందుకు బుద్ధిని జీవితం ఇలా ఒక్కసారిగా తలకిందులైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023