Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలనొప్పితో ఆస్పత్రిలో చేరిన మహిళ.. తలను స్కాన్ చేయగా డాక్టర్లు షాక్..ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్.

ఓ మహిళ వింత వ్యాధితో బాధపడుతోంది. రాత్రి సమయంలో విపరీతమైన చెమటతో తడిసిపోయింది. అంతేకాదు.. ఆమెకు న్యుమోనియా లక్షణాలు కూడా ఉన్నాయి. అలాగే కడుపు నొప్పి, అతిసారం, పొడి దగ్గుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వెంటనే ఆమెను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. మహిళ మెదడుకు ఎంఆర్‌ఐ స్కాన్ చేశారు. వచ్చిన రిపోర్టు చూసి షాకయ్యారు. ఎందుకంటే.. ఆ మహిళ మెదడులో సజీవంగా ఓ పురుగు ఉంది. పాము మాదిరిగా ఉన్న ఆ పురుగును చూసి అవాక్కయ్యారు వైద్యులు. తమ కెరీర్‌లో ఇలాంటి కేసును చూడలేదని వైద్యులు..

తలనొప్పితో ఆస్పత్రిలో చేరిన మహిళ.. తలను స్కాన్ చేయగా డాక్టర్లు షాక్..ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్.
Live Worm Found In Brain
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 29, 2023 | 3:32 PM

ఓ మహిళ వింత వ్యాధితో బాధపడుతోంది. రాత్రి సమయంలో విపరీతమైన చెమటతో తడిసిపోయింది. అంతేకాదు.. ఆమెకు న్యుమోనియా లక్షణాలు కూడా ఉన్నాయి. అలాగే కడుపు నొప్పి, అతిసారం, పొడి దగ్గుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వెంటనే ఆమెను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. మహిళ మెదడుకు ఎంఆర్‌ఐ స్కాన్ చేశారు. వచ్చిన రిపోర్టు చూసి షాకయ్యారు. ఎందుకంటే.. ఆ మహిళ మెదడులో సజీవంగా ఓ పురుగు ఉంది. పాము మాదిరిగా ఉన్న ఆ పురుగును చూసి అవాక్కయ్యారు వైద్యులు. తమ కెరీర్‌లో ఇలాంటి కేసును చూడలేదని వైద్యులు చెబుతున్నారు. ఇది ప్రపంచంలోనే మొదటి కేసుగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. 64 ఏళ్ల మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పొడవున్న క్రాల్ వార్మ్ సజీవంగా కనిపించింది. అసాధారణంగా 8 సెంటీమీటర్ల లేత ఎరుపు రంగులో ఉన్న ఈ పురుగు మెదడులో మెలికలు తిరుగుతూ కనిపించింది. దీన్ని చూసి వైద్యులు అవాక్కయ్యారు. వాస్తవానికి గత రెండేళ్లుగా బాధిత మహిళకు స్టెరాయిడ్స్‌తో చికిత్స చేస్తున్నారు. కానీ 2022 సంవత్సరం తర్వాత మహిళ తీవ్రమైన డిప్రెషన్, మతిమరుపు సమస్యతో మరింత ఇబ్బంది పడుతోంది. దీంతో వైద్యులు ఆమె తలను MRI స్కాన్ చేశారు. వచ్చిన రిపోర్ట్ చూసి వారి మైండ్ బ్లాంక్ అయ్యింది.

మెదడులో కనిపించిన పాములాంటి పురుగు..

కాన్‌బెర్రాలోని ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ సంజయ్ సేనానాయక్ మాట్లాడుతూ.. ‘స్త్రీ మెదడులో కనిపించే పురుగు పాములా ఉందని సర్జన్ నాకు ఫోన్‌లో చెప్పడంతో నేను మరింత షాక్‌కు గురయ్యాను.’ అని అన్నారు. ఈ కీటకం శాస్త్రీయ నామం ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ. ఇది ఒక ప్రత్యేక రకం రౌండ్‌వార్మ్, ఇది కార్పెట్ పైథాన్‌లలో కనిపిస్తుంది. ఈ కొండచిలువ జాతి ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పాపువా న్యూ గినియాలో కనిపిస్తుంది.

ఇది కారణం కావచ్చు..

ఈ పురుగు మహిళ మెదడులోకి ఎలా చేరిందో వైద్యులకు ఏమాత్రం అర్థం కావడంలేదట. మహిళ తిన్న ఆకు కూరలపై ఉన్న లార్వా ద్వారా ఇది అభివృద్ధి చెంది ఉండొచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక సదరు మహిళ తన పెంపుడు జంతువును పెంచుకునేదని, దాని ద్వారా కూడా లార్వా ఆమె నోట్లోకి, తద్వారా శరీరంలోకి ప్రవేశించి, ఆ తరువాత వృద్ధి చెంది ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇది సాధారణంగా గొర్రెలు, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులలో లార్వా ద్వారా అభివృద్ధి చెందుతుందని, ఇప్పటి వరకు మనుషుల్లో అయితే గుర్తించలేదని చెబుతున్నారు నిపుణులు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..