Korean Skincare Tips: కొరియన్ అమ్మాయిలు రోజూ చెంపదెబ్బలు కొట్టుకుంటారు.. దీని వెనుక లాజిక్ తెలిస్తే షాక్ అవుతారు..!
కొరియన్ అమ్మాయిల అందం గురించి ఎప్పుడూ చర్చ ఉంటూనే ఉంటుంది. తమ చర్మం కూడా వారిలాగే సాఫ్ట్‌గా ఉండాలని భావిస్తుంటారు. వారి అందం వెనుక రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. మన దేశ ప్రజలు కూడా కొరియన్ బ్యూటీ టిప్స్ ఫాలో అవుతుంటారు. ఇక వారి చర్మ సౌందర్య రహస్యాలపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ఓ అద్భుతమైన బ్యూటీ టిప్స్ మీకోసం తీసుకువచ్చాం. కొరియన్ అమ్మాయిల మేని చర్మం తెల్లగా, నిగనిగలాడుతుంది. మచ్చలేని చంద్రుడిగా ప్రతిబింబిస్తుంటుంది. అయితే, కొరియన్ అమ్మాయిలు ప్రతి రోజూ తమ చెంపలపై..

కొరియన్ అమ్మాయిల అందం గురించి ఎప్పుడూ చర్చ ఉంటూనే ఉంటుంది. తమ చర్మం కూడా వారిలాగే సాఫ్ట్‌గా ఉండాలని భావిస్తుంటారు. వారి అందం వెనుక రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. మన దేశ ప్రజలు కూడా కొరియన్ బ్యూటీ టిప్స్ ఫాలో అవుతుంటారు. ఇక వారి చర్మ సౌందర్య రహస్యాలపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ఓ అద్భుతమైన బ్యూటీ టిప్స్ మీకోసం తీసుకువచ్చాం. కొరియన్ అమ్మాయిల మేని చర్మం తెల్లగా, నిగనిగలాడుతుంది. మచ్చలేని చంద్రుడిగా ప్రతిబింబిస్తుంటుంది. అయితే, కొరియన్ అమ్మాయిలు ప్రతి రోజూ తమ చెంపలపై తామే కొట్టుకుంటారట. ఇలా చేయడం వెనుక ఓ బ్యూటీ సీక్రెట్ ఉందట. మరి అలా చేయడానికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇది నిజమేనా?
కొరియన్ అమ్మాయిలు ప్రతిరోజూ తమ చెంపలను కొట్టుకుంటారని చాలా నివేదికల్లో పేర్కొన్నారు. కొరియన్ అమ్మాయిలు ఇలా చేయడం వారిని వారు శిక్షించుకుంటున్నట్లుగా అందరూ భావిస్తారు. కానీ, దాని వెనుక కారణం వేరే ఉందంటున్నారు. అలాగమని కోపంతోనూ కొట్టుకోరట. అమ్మాయిలు తమ అందాన్ని పెంచుకోవడానికే ఇలా చేస్తుంటారట.
అమ్మాయిలు ఎందుకిలా చేస్తారు?
ఒక్క కొరియాలోనే కాదు.. భారత్‌తో సహా పలు దేశాల్లోని అమ్మాయిలు కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారట. తమను తాము కొట్టుకుంటున్నారట. ఇలా చేయడం వలన చర్మం మంచిగా, ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుందట. అమ్మాయిలు తమ చర్మం మరింత అందంగా ఉండటానికే ఇలా కొట్టుకుంటారట. చెంపలపై కొట్టడం వలన చర్మానికి మేలు జరుగుతుందని, స్లాప్ థెరపీలా పని చేస్తుందని అంటున్నారు.
స్లాప్ థెరపీ అంటే ఏమిటి?
ఈ థెరపీలో భాగంగా చెంపలపై, ముఖంపై కొడతారు. అంటే గట్టిగా కొట్టరు. సాధారణంగా చెంపలను చరుస్తారు. ఇది కొరియాలో అత్యంత ప్రసిద్ధ పద్ధతిగా పరిగణించబడుతుంది. అక్కడ ఇది ప్రసిద్ధ బ్యూటీ ట్రిక్. వాస్తవానికి, చెంపలపై చిన్నగా కొట్టడం వలన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని కారణంగా ఇది యాంటీ ఏజింగ్ పద్ధతిగా పరిగణించబడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేసి ముడతలను తగ్గిస్తుంది. ఈ టెక్నిక్ చర్మాన్ని మరింత ఆరోగ్యంగా మారుస్తుంది. అయితే, ఈ పద్ధతిని చాలా జాగ్రత్తగా అనుసరించాల్సిన అవసరం ఉంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




