మీ ఇంటిలో కొత్తిమీర త్వరగా పాడైపోతుందా.. బెస్ట్ టిప్స్ మీకోసమే!

Samatha

4 January 2026

కొత్తిమీర తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరి వంటింటిలో తప్పకుండా కొత్తిమీర అనేది ఉంటుంది.

కొత్తిమీర

ఇక కొత్తిమీర వంటల్లో వేసుకోవడం వలన వచ్చే టేస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకర్రీ అయినా సరే, ఏ వంటకాలు అయినా సరే కొత్తిమీర వేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.

వంటల్లో రుచి

అయితే రుచి మాత్రమే కాకుండా, కొత్తిమీర తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు నిపుణులు. అందుకే చాలా మంది తప్పనిసరిగా దీనిని తింటుంటారు.

ఆరోగ్య ప్రయోజనాలు

ఇక కొంత మంది ఎక్కువగా బాధపడేది, వారు తెచ్చుకునే కొత్తిమీర త్వరగా పాడవుతుంది. ఎంత నిల్వ చేసినా, అది ఎక్కువ కాలం ఉండటం లేదని బాధపడుతుంటారు.

తాజా కొత్తిమీర

కాగా, ఇప్పుడు మనం కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం.

కొత్తిమీర తాజా చిట్కాలు

కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే, కొత్తిమీర కొనుగోలు చేసే రోజే,మార్కెట్‌లోపసుపు రంగులో ఆకులు లేని కొత్తిమీరను కొనుగోలు చేయాలంట.

పసుపు రంగు ఆకులు

అదే విధంగా కొత్తిమీర కింద కాడలను కట్ చేసి, గ్లాస్‌లో సగం వాటర్ పోసి, అందులో కొత్తిమీర నిటారుగా పెట్టి, పైన కవర్ చుట్టి , ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది.

గ్లాస్ వాటర్‌లో

అలాగే తడి పేపర్ టవల్‌లో కూడా కొత్తిమీరు చాలా సులభంగా ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా చేసుకోవచ్చునంట. కొత్తిమీరకాడలు కట్ చేసి, తడి టవల్‌లో చుట్టి, గాలి చొరబడని బాక్స్‌లో పెట్టాలి.

తడి పేపర్ టవల్