Monsoon Hacks: వర్షాకాలంలో బట్టలు దుర్వాసన వెదజల్లుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలను పాటించి చూడండి

వర్షాకాలంలో ఓ వైపు కురిసే వానలు.. మరోవైపు చల్లని వాతావరణం ఉంటుంది. సీజనల్ వ్యాధులు మాత్రమే కాదు కొన్ని రోజువారీ జీవితంలో సమస్యలు కూడా ఏర్పడాతాయి. వాటిల్లో అధిక పెద్ద సమస్య బట్టలు ఆరబెట్టడం. వర్షాలు, చల్లని వాతావరణంలో తడిసిన బట్టలను ఉంచుకోలేక, ఉతికిని బట్టలను ఆరబెట్టుకోలేక మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. దీంతో వర్షాకాలంలో ఇంటి నిండా తడిపొడి బట్టలే దర్శనమిస్తాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ఉతికిన బట్టలను ఆరబెట్టడానికి.. మంచి వాసన వచ్చే విధంగా చేయడానికి కొన్ని వంటింటి చిట్కాలున్నాయి. అవి ఏమిటో ఈరోజు తెలుసుకుందాం.. 

Surya Kala

|

Updated on: Aug 29, 2023 | 2:31 PM

వర్షాకాలంలో ఉతికిన బట్టలు ఎండలో ఆరకపోతే దుర్వాసన వస్తుంది. బట్టల నుంచి వచ్చే వాసనతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు తమ బట్టలను ఆరబెట్టడానికి ఫ్యాన్ ని ఆశ్రయిస్తే.. మరికొందరు  వాషింగ్ మెషీన్ డ్రైయర్ లో వేసి ఆరబెట్టడానికి ప్రయత్నిస్తారు.  ఈ నేపథ్యంలో ఇంట్లోని వస్తువులతో సింపుల్ చిట్కాల గురించి తెలుసుకుందాం.. 

1 / 7
 వర్షాలు, వరదల తో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉతికిన బట్టలు తొందరగా ఆరవు. ఒకొక్కసారి ఆ బట్టల నుంచి దుర్గంధం వెలువడుతుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనుసరించాల్సిన మార్గాలు ఉన్నాయి

2 / 7
నిమ్మకాయ ఈ విషయంలో మీకు సహాయం చేస్తుంది. వాషింగ్ చేసే సమయంలో బకెట్ లోని నీటిలో కొద్దిగా నిమ్మ తొక్క వేయండి. ఇప్పుడు అందులో బట్టలు ఉతకాలి. లేదా డిటర్జెంట్‌తో నిమ్మరసం కలుపుకోవడం వల్ల బట్టలు దుర్వాసన రాకుండా చూసుకోవచ్చు. నిమ్మరసం దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది.

3 / 7
బట్టల నుంచి చెడు వాసన రాకుండా వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. లాండ్రీ నీటిలో కొన్ని చెంచాల వెనిగర్ కలపండి. ఇప్పుడు అందులో బట్టలు ముంచి ఉతకాలి. మీరు మంచి ఫలితాలు పొందుతారు.

4 / 7
బట్టల దుర్గంధాన్ని తొలగించడానికి కూడా నాఫ్తలీన్ ఉపయోగించవచ్చు. ఉతికిన బట్టల మధ్య నాఫ్తలీన్ ఉంచండి. బట్టల నుంచి వచ్చే వాసనను తొలగిస్తాయి. 

5 / 7

అంతేకాకుండా, ఈ రోజుల్లో మార్కెట్లో చాలా సువాసన గల డిటర్జెంట్లు అందుబాటులో ఉన్నాయి. వంట కోసం  ఉపయోగించే బేకింగ్ సోడా బట్టల నుండి వచ్చే వాసనను తొలగిస్తుంది. మీ డిటర్జెంట్‌తో బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమంతో బట్టలు ఉతకడం వల్ల బట్టలు తాజాగా ఉంటాయి దానితో బట్టలు మంచి వాసన వస్తాయి.  

6 / 7
వర్షాకాలంలో బట్టల మధ్య కర్పూరం ఉంచడం వల్ల బట్టల వాసన పోతుంది. బట్టలు ఆరబెట్టిన చోట సాంబ్రాణి పొగ వేయటం వల్ల బట్టలు కూడా సువాసనగా ఉంటాయి.

7 / 7
Follow us