ఈ ఆకు కూరలు వండి తింటేనే రెట్టింపు మేలు..

09 February 2026

TV9 Telugu

TV9 Telugu

ఆకుపచ్చని ఆకుకూరల్లో పోషకాలు ఎక్కువ. ఇవి రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తాయనీ మనకు తెలుసు. కానీ, కొన్ని ఆకుకూరలను ఉడికించి తినడం వల్ల వాటి పోషక విలువలు రెట్టింపు అవుతాయి అంటున్నారు నిపుణులు

TV9 Telugu

పాలకూరలో ఆక్సాలిక్‌ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాల్షియం, ఐరన్, విటమిన్‌ ఇ వంటి పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకునే ఆస్కారం ఉంది

TV9 Telugu

 పాలకూరను ఉడికిస్తే దీనిలోని ఆమ్ల శాతం తగ్గి పోషకాలు అందడంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలా అని ఎక్కువ సమయం ఉడికించడం కూడా మంచిది కాదు

TV9 Telugu

విటమిన్‌ ఎ, సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే మునగాకు ఉడికించి తింటే అందులో పోషకాలు పెరుగుతాయి. ఇవి శరీరంలో వాపు, మంటలను తగ్గిస్తాయి. క్యాన్సర్‌ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి

TV9 Telugu

యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. కెలోరీలు తక్కువగా, ఫైబర్‌ ఎక్కువగా ఉండే బచ్చలిని ఉడికించి తినడం మేలు. ఇలా చేయడంవల్ల దానిలో బీటా కెరోటిన్, మెగ్నీషియం స్థాయులు పెరుగుతాయి

TV9 Telugu

అంతేకాదు, దీన్నుంచి లభించే విటమిన్‌ ఎ, సి, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు శరీరానికి సమపాళ్లలో అందుతాయి

TV9 Telugu

అయితే కొన్ని ఆకుకూరల్ని మాత్రం సన్నని సెగమీద కొంచెం నూనెతో వేయించడం వల్ల పోషకాలు పెరుగుతాయి. వాటిలో తోటకూర ఒకటి

TV9 Telugu

దీన్ని వేయించడం వల్ల ఫోలేట్, విటమిన్‌ సి పెరిగి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. మెంతికూరను వేయిస్తే పాలీఫినాల్స్‌ పెరిగి జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి