- Telugu News Photo Gallery Cinema photos Rajini kanth visited the Bengaluru Public Transport depot where did work as a bus conductor before hero telugu cinema news
Rajini Kanth: సింప్లిసిటిని చాటుకున్న సూపర్ స్టార్.. తాను పనిచేసిన బస్ డిపోకు వెళ్లి..
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ డిపోను సందర్శించారు. రజనీకాంత్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఫిల్మ్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు చూసి ఇప్పుడు అంత ఎత్తుకు ఎదిగారు. కోట్లకు అధిపతి అయిన ఆయన ఎప్పుడూ సింపుల్ గా ఉంటారు.
Updated on: Aug 29, 2023 | 2:15 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ డిపోను సందర్శించారు.

రజనీకాంత్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఫిల్మ్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు చూసి ఇప్పుడు అంత ఎత్తుకు ఎదిగారు. కోట్లకు అధిపతి అయిన ఆయన ఎప్పుడూ సింపుల్ గా ఉంటారు.

మంగళవారం జయనగర్ బీఎంటీసీ డిపోకు ఉదయం 11:30 గంటలకు రజనీకాంత్ చేరుకున్నారు. ఆయన రాక పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. 11:45 వరకు రజనీకాంత్ డిపోలోనే ఉన్నారు. సిబ్బందితో రజనీ మాట్లాడారు.

కొద్దిసేపు అక్కడున్న సిబ్బందితో మాట్లాడిన రజనీకాంత్ డిపో లోపలే తిరిగారు. అక్కడ ఆయన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అందరూ రజనీతో సెల్ఫీలు దిగారు.

హీరో కాకముందు రజినీకాంత్ బస్ కండక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. జయనగర్ డిపోలో పనిచేశారు. అందుకే ఇక్కడికి వచ్చారు. తన స్నేహితుడు రాజ్ బహదూర్ కూడా రజనీతో ఉన్నాడు.





























