- Telugu News Photo Gallery Cinema photos Actress Sridevi Vijaykumar Shares beautiful bule saree photos in her instagram telugu cinema news
Sridevi Vijaykumar: ‘నీలిరంగు చీరలోనే సందమామ నీవె జాణ’.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?..
ఫోటోస్ చూడగానే.. నీలిరంగు చీరలోనే సందమామ నీవె జాణ.. అంటూ ప్రకాష్ రాజ్ పాడిన సాంగ్ గుర్తుకు వస్తుంది కదా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆ హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారే. గుర్తుపట్టారా ?. తనే హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్. ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
Updated on: Aug 29, 2023 | 12:24 PM

పైన ఫోటోస్ చూడగానే.. నీలిరంగు చీరలోనే సందమామ నీవె జాణ.. అంటూ ప్రకాష్ రాజ్ పాడిన సాంగ్ గుర్తుకు వస్తుంది కదా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆ హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారే. గుర్తుపట్టారా ?. తనే హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్. ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

తమిళ్ నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతులకు శ్రీదేవి చిన్న కూతురు. 1986 అక్టోబర్ 29న జన్మించిన శ్రీదేవి.. రుక్మిణి సినిమాలో బాలనటిగా నటించింది. ఆ తర్వాత 2002లో ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాలోనే అందం, అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత తెలుగులో శ్రీదేవికి అంతగా అవకాశాలు రాలేదు. 2003లో తరుణ్ నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో నటించింది శ్రీదేవి. అలాగే నిరీక్షణ చిత్రంలో కనిపించిన శ్రీదేవి కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శ్రీదేవి 2011లో వీర సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో మాస్ మాహారాజ రవితేజ చెల్లిగా కనిపించింది. ప్రస్తుతం శ్రీదేవి తన భర్త, పిల్లలతో కలిసి చెన్నైలో ఉంటున్నారు.

పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శ్రీదేవి 2011లో వీర సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో మాస్ మాహారాజ రవితేజ చెల్లిగా కనిపించింది. ప్రస్తుతం శ్రీదేవి తన భర్త, పిల్లలతో కలిసి చెన్నైలో ఉంటున్నారు.

నీలిరంగు చీరలోనే సందమామ నీవె జాణ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?..




