- Telugu News Photo Gallery Cinema photos Pan India Star Prabhas Movie salaar Business promotion Details Telugu Entertainment Photos
Prabhas – Salaar: నెక్స్ట్ సినిమాల బిజినెస్ లతో ప్రభాస్ పై ప్రజర్.. మరి డార్లింగ్ ఎం చేస్తాడు.?
ప్రభాస్ సలార్ సినిమా బిజినెస్ ఇంకా ఎందుకు జరగలేదు. అసలు సలార్‌కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్ ఎంత? ఆ సినిమా కలెక్ట్ చేయాల్సిన టార్గెట్ ఎంత? సెప్టెంబర్ 7 కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఆ రోజు నుంచి విండోస్ ఓపెన్ చేస్తామని ప్రశాంత్ నీల్ ఇన్‌డైరక్ట్ గా ఎందుకు చెబుతున్నారు? సలార్ సినిమా కోసం అభిమానులే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా ఇష్టంగా ఎదురుచూస్తున్నాయి. బిజినెస్ వర్గాల్లోనూ సలార్ మీద ఫోకస్ ఉంది.
Updated on: Aug 29, 2023 | 12:50 PM

ప్రభాస్ సలార్ సినిమా బిజినెస్ ఇంకా ఎందుకు జరగలేదు. అసలు సలార్‌కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్ ఎంత? ఆ సినిమా కలెక్ట్ చేయాల్సిన టార్గెట్ ఎంత? సెప్టెంబర్ 7 కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు?

ఆ రోజు నుంచి విండోస్ ఓపెన్ చేస్తామని ప్రశాంత్ నీల్ ఇన్‌డైరక్ట్ గా ఎందుకు చెబుతున్నారు? సలార్ సినిమా కోసం అభిమానులే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా ఇష్టంగా ఎదురుచూస్తున్నాయి. బిజినెస్ వర్గాల్లోనూ సలార్ మీద ఫోకస్ ఉంది. ఈ సినిమా బిజినెస్‌ని ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు మేకర్స్.

అంతలా ఎందుకు ఊరిస్తున్నారనే చర్చ కూడా బాగానే జరుగుతోంది. ప్రభాస్ గత సినిమాలకు క్రేజ్ వచ్చింది కానీ, కలెక్షన్లు లేవు. అయితే ప్రశాంత్ నీల్ గత సినిమాల గ్రాఫ్ రెయిజింగ్‌లోనే ఉంది. ఇప్పుడు డార్లింగ్ ఫెయిల్యూర్స్ ని డీల్ చేసి, సక్సెస్ రూట్లోకి మళ్లించాల్సిన బాధ్యత ఆయనదే.

అందుకే బిజినెస్ విషయంలోనూ ఆచితూచి అడుగులు వేద్దామని మేకర్స్ కి సలహా ఇస్తున్నారట కెప్టెన్. సెప్టెంబర్ 7న విడుదల కానుంది సలార్ ట్రైలర్. జవాన్‌తో పాటు థియేటర్స్ లో ప్లే కానుంది. ఆల్రెడీ 140 సెకన్ల ట్రైలర్‌ని అద్భుతంగా కట్ చేయించారట ప్రశాంత్ నీల్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత బిజినెస్‌లో హైప్ అమాంతం పెరుగుతుందట.

ఆ కాన్ఫిడెన్స్ తోనే 150 క్రోర్స్ ప్లస్ బిజినెస్ ఒన్లీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందని అంటోంది యూనిట్. ఆదిపురుష్ అండ్ అదర్ ప్రీవియస్ మూవీస్ ఫెయిల్యూర్స్ సలార్ మీద పడకుండా జాగ్రత్తగా డీల్ చేయమని ప్రభాస్ కూడా సలహా ఇచ్చారట. అంతే కాదండోయ్...

ఇండియన్ హిస్టరీలో వెయ్యి కోట్లు దాటి కలెక్ట్ చేసిన సినిమాల్లో సలార్‌కి ప్లేస్ దక్కేలా రిలీజ్ ప్లాన్ చేయమని కూడా హింట్ ఇచ్చారట డార్లింగ్. మీరు ఆ మాత్రం చెబితే చాలు, మేం రెచ్చిపోతాం అంటూ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు ప్రొడ్యూసర్స్.




