- Telugu News Photo Gallery Cinema photos Akkineni Nagarjuna Birthday special these are the iconic roles made that nagarjuna is legend for telugu cinema telugu cinema news
Akkineni Nagarjuna Birthday: నాగార్జున ఓ లెజెండ్ అని నిరూపించిన చిత్రాలు ఇవే.. ఎప్పటికీ మర్చిపోలేని పాత్రలు..
నాగార్జున కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. కెరీర్ మొదట్లో కేవలం ట్రాజెడీ హీరో అన్న పేరు వచ్చినప్పటికీ..ఆ తర్వాత లవ్, క్లాస్, మాస్ చిత్రాలతో తానేంటో నిరూపించుకున్నారు. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో.. విభిన్న చిత్రాలను ప్రయత్నించడంలో నాగ్ ముందుంటారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ జోనర్ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
Updated on: Aug 29, 2023 | 8:44 AM

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు యువతలో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. విక్రమ్ సినిమాతో అరంగేట్రం చేసి శివతో రఫ్పాడించి.. అన్నమయ్యగా భక్తి గీతాలు ఆలపించారు. అసాధారణమైన నటనతో సినీ విమర్శకులను మెప్పించడమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో 100 చిత్రాలకు పైగా నటించి ఎంతో మంది తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నారు.

నాగార్జున కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. కెరీర్ మొదట్లో కేవలం ట్రాజెడీ హీరో అన్న పేరు వచ్చినప్పటికీ..ఆ తర్వాత లవ్, క్లాస్, మాస్ చిత్రాలతో తానేంటో నిరూపించుకున్నారు. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో.. విభిన్న చిత్రాలను ప్రయత్నించడంలో నాగ్ ముందుంటారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ జోనర్ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

శివ.. నాగార్జున కెరీర్లోనే మొదటి క్రైమ్ యాక్షన్ చిత్రం. కాలేజీ స్టూడెంట్ గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనేది సినిమా. ఇందులో శివ పాత్రలో నాగార్జున కనిపించగా.. రాజకీయ నాయకుడు మాచిరాజు లెక్కల కింద తయారైన కరుడుగట్టిన క్రైమ్ లార్డ్ భవానీ పాత్రలో రఘువరన్ నటించారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు.. మూడు నంది అవార్డ్స్ సొంతం చేసుకుంది.

గీతాంజలి.. 1989లో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం భారీగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన మొదటి చిత్రం. ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్న ఓ యువకుడి ఊటికి వెళ్లిపోతాడు. అక్కడ అతనికి గీతాంజలి అనే అమ్మాయి పరిచయం కావడం.. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది ఈ చిత్రం.

అన్నమయ్య.. 1997లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం 15వ శతాబ్దపు స్వరకర్త అన్నమాచార్య జీవితం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకు ఎనిమిది నంది అవార్డ్స్, మూడు ఫిల్మ్ పేర్ అవార్డ్స్, రెండు జాతీయ చలనచిత్ర అవార్డ్స్ వచ్చాయి. ఇందులో అన్నమయ్య పాత్రలో కనిపించారు నాగ్.

రాజన్న.. 2011లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రజాకార్లు ఉధ్యమం, వీర స్వాతంత్ర సమరయోధుడు సుద్దాల హన్మంతు నుంచి ప్రేరణ పొందిన యాక్షన్ డ్రామా. ఈ సినిమాను స్వయంగా నాగార్జున నిర్మించారు. ఇందులో రాజన్న పాత్రలో నాగార్జున కనిపించారు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు వి. విజయేంద్ర ప్రసాద్ దర్సకత్వం వహించారు.

హలో బ్రదర్.. 1994న విడుదలైన ఈ యాక్షన్ కామెడీ ట్వీన్ డ్రాగన్స్ (1992)చిత్రానికి రీమేక్. ఇందులో నాగ్ ద్విపాత్రాభినయం చేశారు. 1994లో అత్యధిక వసూళ్లు సాధించిన ఏకైక తెలుగు చిత్రం ఇదే.




