Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో రాగి సూర్యుడు ఏ దిశలో ఉండాలో తెలుసా.?
ఇంట్లో వాస్తుకు అనుగుణంగా ఏర్పాటు చేసుకునే వస్తువుల్లో రాగి సూర్యుడి ప్రతిమ ఒకటి. ఇటీవలి కాలంలో చాలా మంది ఇంట్లో దీనిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా, ఈ రాగి సూర్యుడిని ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో ఈ రాగి సూర్యుడు ఉపయోగపడుతుందని...
మనలో చాలా మంది వాస్తును విశ్వసిస్తుంటారు. వాస్తు శాస్త్రంలో తెలిపిన విషయాలను పాటించడం ద్వారా మంచి జరుగుతుందని భావిస్తుంటారు. అందుకే ఇంటి నిర్మాణం మొదలు అన్ని విషయాల్లో వాస్తును నమ్ముతారు. అందుకు అనుగుణంగా ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకుంటాం.
ఇంట్లో వాస్తుకు అనుగుణంగా ఏర్పాటు చేసుకునే వస్తువుల్లో రాగి సూర్యుడి ప్రతిమ ఒకటి. ఇటీవలి కాలంలో చాలా మంది ఇంట్లో దీనిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా, ఈ రాగి సూర్యుడిని ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో ఈ రాగి సూర్యుడు ఉపయోగపడుతుందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.
సూర్య భగవానుడి నిత్యం పూజించడం ద్వారా జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతుంటారు. అలాగే రాగి సూర్యుడుని పూజించడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇంట్లో రాగి సూర్యుడిని ఏర్పాటు చేసుకునే కుటుంబ సభ్యుల సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడంలో రాగి సూర్యుడు ఉపయోగపడుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే రాగి సూర్యుడిని ఏ దిశలో పెట్టుకోవాలనే ప్రశ్న సహజంగానే వస్తుంది. దీని గురించి కూడా వాస్తు శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. రాగి సూర్యుడిని తూర్పు గోడపై ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంటికి శ్రేయస్సు పెరుగుతుంది. ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంటే, తలుపు వెలుపల రాగి సూర్యుడిని ఉంచడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇక ఆఫీసుల్లోనూ తూర్పు గోడపై సూర్యుడిని వేలాడదీయడం వల్ల కెరీర్‌లో పురోగతి లభిస్తుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..